ఇందులో భాగంగా ఇప్పటికే 20 మంది పిల్లలను కనేశారంట ఈ దంపతులు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలనే పెంచలేక నానా అవస్థలు పడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఆల్రెడీ 20 మంది పిల్లలను పెంచుతూ ఏకంగా 100మంది పిల్లలని పెంచాలనుకోవడం పిచ్చే కదా.
12 నెలల క్రితం క్రిస్టినా ఒక కూతురుకి మాత్రమే జన్మనిచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఏకంగా 21 మంది పిల్లలకు తల్లి అయింది. ఆమెకు సర్రోగసీ అంటే అద్దె గర్భం ద్వారా 20 మంది పిల్లలు పుట్టారని డాక్టరల్ఉ చెబుతున్నారు. జార్జియాలో ఉంటున్న క్రిస్టినా, గలిప్ ఓజ్తుర్క్ అనే భార్యాభర్తలకు పిల్లలంటే పిచ్చి. అందుకే 100 మంది పిల్లలు కావాలని ఈ విధమైన ప్లాన్ వేశారు.
బిజినెస్ మ్యాన్ అయిన గలిప్ పిల్లల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సర్రోగసీ ద్వారా పిల్లల కోసం 1.5 కోట్లు ఖర్చు చేశారంట ఈ వింత దంపతులు. అంతే కాదు పుట్టిన పిల్లలను చూసుకోవటానికి ఏకంగా 16 మంది ఆయాలను నియమించాడంట. వీటన్నింటి కోసం ఏడాదికి రూ.70 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు వీరిద్దరు. ఇప్పుడు వారికి ఉన్న మూడు అంతస్థుల బిల్డింగులో నాలుగు నెలల నుండి 14 నెలల వరకు వయస్సు ఉన్న చిన్న పిల్లలు నివసిస్తున్నారు. అంతేకాదు క్రిస్టినాకు మొదటి వివాహం వల్ల కలిగిన సంతానం ఆరేళ్ల విక్టోరియా కూడా ఇదే ఇంట్లో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి