సాధారణంగా ఎక్కువగా భూమి ఉంది ఇక ఆ భూముల్లో స్వయంగా పంటలు పండించేవారు భూస్వామి అంటూ ఉంటారు. మన దేశంలో చాలా మంది భూస్వాములు ఉన్నారు.  ఇక వారినే అతి పెద్ద రైతులుగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు.  అయితే ఇటీవలే టెక్నాలజీని శాసిస్తున్న వాడే అమెరికాలో అతిపెద్ద రైతు గా మారిపోయాడు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ద్వారా  టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ బిల్గేట్స్ ఇటీవలే అమెరికాలో అతిపెద్ద రైతు గా రికార్డు సృష్టించాడు.



 సాఫ్ట్వేర్ రంగానికి చెందిన బిల్ గేట్స్ అటు అతి పెద్ద రైతు కావడం ఏంటి జోక్ చేస్తున్నారా అని అంటారు ఈ విషయం తెలిస్తే ఎవరైనా.. కానీ ఇది నిజంగా నిజమే.. అమెరికాలో ఉన్న అతి పెద్ద రైతులలో బిల్గేట్స్ కూడా ఒకరు అన్న విషయం ఇటీవలే బయటపడింది.  బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్  అమెరికాలోని 18 రాష్ట్రాల్లో ఏకంగా 2 లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు  లూసియానా, నెబ్రాస్కా, జార్జీయా సహా ఇతర ప్రాంతాలలో భారీగా వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు బిల్గేట్స్ దంపతులు. ఇక బిల్ గేట్స్ దంపతులకు నార్త్ లూసియానాలో ఏకంగా 70 వేల ఎకరాల భూమి ఉంది.


 ఈ భూమిలో సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం లాంటివి పండిస్తున్నారు. ఇక నెబ్రాస్కా లో 20 వేల ఎకరాలు ఉండగా అక్కడ కూడా సోయాబీన్ పండిస్తున్నారు. జార్జియా లో ఆరు వేల ఎకరాలు వాషింగ్టన్ లో 14 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో బంగాళదుంపలు పండిస్తారట. ఇలా ప్రతి ఏటా లక్షల టన్నుల పంట దిగుబడిని పొందుతున్నారు బిల్గేట్స్ దంపతులు. ప్రస్తుతం ప్రపంచంలో వ్యవసాయ రంగం ఎంతో కీలకమైనదని.. పంటలు పండించడం వల్ల ఎన్నోసార్లు ఆహార సమస్యను ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది అంటూ బిల్గేట్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: