విశాఖ ను పరిపాలన రాజధానిగా మారుస్తామని గతం లో సీఎం జగన్ ప్రకటించిన నాటి నుంచి ఇక విశాఖలో రియల్టర్లు రెచ్చి పోతున్నారు. ఇక కనిపించిన భూమి మొత్తాన్ని కబ్జాలకు పాల్పడుతున్నారు.   విశాఖ లో రియల్టర్ల ఆగడాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి అన్న  విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం లో ఇక రియల్టర్ల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. రియల్టర్లు కబ్జా చేసిన భూముల అన్నింటిని ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసు కుంటుంది. ఇటీవలే ఈ విషయం పై మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.



 విశాఖ లో జరుగుతున్న భూ ఆక్రమణల పై అటు ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది అంటూ ఆయన చెప్పారు. కేవలం ఐదు నెలల సమయం లో ఆక్రమణలకు గురైన 430 ఎకరాలను వెనక్కి తీసుకున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పు కొచ్చారు. అయితే కబ్జాకు గురైన భూము లను వెనక్కి తీసుకుంటే అటు టీడీపీ మాత్రం కక్ష సాధింపు చర్యలు అంటుంది అంటూ వ్యాఖ్యానించారు మంత్రి అవంతి   కబ్జా చేస్తే చర్యలు తీసుకోవడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు.



 ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బండారం బట్ట బయలైందని.. ప్రస్తుతం ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు అంటూ మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. అయితే అటు పలువురు టిడిపి ఎమ్మెల్యేల కుటుంబాల ఆధీనం లో కూడా కబ్జాకు గురైన భూములు ఉన్నాయని గుర్తించామని ఈ సందర్భం గా మంత్రి అవంతి తెలిపారు.  అయితే ఇంకా సినిమా అయిపో లేదని.. ముందుంది ముసళ్ళ పండుగ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఇక ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని ఆక్రమించుకున్న భూములు అన్నింటిని వెనక్కి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: