వ్యాక్సిన్ పై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కోలాగా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పలువురు అవగాహన కార్య క్రమాలు చేపడుతున్నారు.  ఇంకొంత మంది ఏకంగా వ్యాక్సింగ్ వేసుకో వడానికి జనాలు ముందుకు వచ్చేలా బహుమతులు ఇచ్చేందుకు కూడా సిద్ధ మవుతున్నారు.  ఇక మరి కొంత మంది ఇంకా వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు.  అయితే ఇప్పటి వరకు ప్రజలందరి లో వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలు అపోహలను తొలగించి ఇక అందరికీ టీకా అందించే విధం గా ఎంతో మంది సరికొత్త ఆఫర్లను ప్రకటించారు.



 ఇక ఇటీవలే మధ్య ప్రదేశ్ లో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గం లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు వినూత్నమైన ఆఫర్తో ముందు కొచ్చారు. 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసిన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయల బహుమానం ఇస్తాను అంటూ బిజెపి ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ప్రకటించడం ఆసక్తికరం గా మారింది. ఇక ఇప్పుడు మరో సారి ప్రజలందరిని వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రోత్సహించేలా ఇంకో ఆఫర్ కూడా ప్రకటించారు ఎమ్మెల్యే.



 తన నియోజకవర్గం లోని బెర్సియా లో కరోనా వైరస్ టీకా వేసుకున్న గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మొబైల్స్ కి రీఛార్జ్ తానే స్వయం గా చేయిస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యే ఇచ్చిన ఆఫర్ కు ఆకర్షితులై వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే తన నియోజకవర్గం లో 100% టీకా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే వినూత్నం గా ప్రయత్నిస్తున్న తీరు ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటోంది.  అయితే ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల లో కూడా పలువురు ప్రజా ప్రతి నిధులు ఇలా వ్యాక్సిన్ వేసు కునేందుకు ముందుకు వచ్చేలా ప్రజలకు వివిధ రకాల ఆఫర్లను అందిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: