తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడం తో చివరికి ఇంటర్ పరీక్షలు నిర్వహించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం.  ఇక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సైతం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో  మార్కుల కేటాయింపు ఎలా ఉంటుంది అనే దానిపై విద్యార్థులందరిలో ఆందోళన నెలకొంది.  అయితే తాజాగా తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది.



 విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ తెలిపింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ఆయా సబ్జెక్టుల్లో ఎంత మొత్తంలో అయితే మార్కులు ఉన్నాయో.. రెండో ఏడాది కూడా అదే తరహా మార్కులు కేటాయించబోతున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇక రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్ కి అటు పూర్తి మార్కులు ఇస్తున్నాము అంటూ తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. అయితే గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఏదైనా ఫెయిలైన సబ్జెక్టు ఉంటే రెండో ఏడాది కూడా 35 మార్కులు కేటాయించినట్లు తెలంగాణ  విద్యాశాఖ ఇటీవలే జారీచేసిన మార్గదర్శకాల్లో  ప్రకటించింది.



 అటు ప్రైవేటు గా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇదే తరహాలో 35 మార్కులు ఇవ్వనున్నట్లు ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఒకవేళ ప్రస్తుతం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కేటాయించిన ఫలితాలతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందక పోతే.. ఇక పరిస్థితులు మెరుగైన తర్వాత ఇక ఆ విద్యార్థులకు ప్రత్యేకం గా పరీక్షలు నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ తెలిపింది తెలంగాణ విద్యాశాఖ.  ఇక ఈ మేరకు ఇటీవలే ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి కూడా ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: