హుజరాబాద్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మాటలతో నేతలంతా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ జోరు ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే హుజురాబాద్ గులాబీ కంచుకోట అని చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈటల రాజేందర్ ఎప్పుడు కూడా తనకు వచ్చిన పదవులపై సంతృప్తి చెందలేదని, ఏనాడు పార్టీకి విధేయుడిగా లేడని   సుమన్ అన్నారు. 2021 నుంచి హుజురాబాద్ గులాబీ కంచుకోట అని ఎన్నికల్లో గెలుపు టిఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. తల్లిలాంటి టిఆర్ఎస్, తండ్రి లాంటి కేసీఆర్ పై విమర్శలు చేయడం  ఈటలకు మంచిది కాదన్నారు.

  ఈటల టిఆర్ఎస్ పార్టీని కార్యకర్త స్థాయి నుండి మొదటి స్థానానికి తీసుకెళ్ళినది నిజమేనని, కానీ లెఫ్ట్ భావాలున్న ఈటల బీజేపీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇదంతా  తన ఆస్తులు కాపాడుకోవడానికి అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎన్నో పదవులు ఇచ్చిందని ఆ సంగతి మర్చిపోవద్దని తెలిపారు. కేబినెట్లో రహస్యంగా చర్చించిన , విషయాలను ఎవరికీ చెప్పవద్దని రాజ్యాంగంలో ఉన్న ఈటల  ఆ నియమాలను ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ  అసైన్డ్ భూములను ఆక్రమించాడని ఆరోపణలు వస్తే దానిపై కేసీఆర్  చర్యలు తీసుకోవడం నేరమా అని ప్రశ్నించారు. అంబేద్కర్, పూలే  భావజాలాన్ని నమ్మే ఈటల బిజెపి పార్టీలో చేరడం తన ఆత్మగౌరవాన్ని చంపకున్నట్లేనని, హుజురాబాద్ నియోజకవర్గన్ని ఆయన ఎప్పుడు అభివృద్ధి చేయలేదని, తన ఆస్తులను మాత్రమే కాపాడుకోవడంలో దృష్టిసారించారన్నారు.

నాలుగు వేల ఇండ్లు హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తే  ఒక్క ఇల్లు కూడా పేదలకు నిర్మించి ఇవ్వలేదని, ఆయన మాత్రం శామీర్ పేటలో ఐదెకరాల భూమిలో పెద్ద కోట నిర్మించుకున్నాడని కడిగిపారేశారు. హుజురాబాద్ లో ఈటల ఓడిపోవడం ఖాయమని, ప్రజలు కేసీఆర్ కి పట్టం కడతారని తెలిపారు. చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: