ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో పొలిటిక‌ల్ వ్యూహ‌క‌ర్త‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌శాంత్ కిషోర్ మోడీని అధికారంలోకి తీసుకు రావ‌డానికి ఎన్నో వ్యూహాల‌తో ముందుకు సాగారు. ఆ ఎన్నిక‌ల్లో పీకే స్ట్రాట‌జీలు దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. ఆ త‌ర్వాత అదే పీకే బిహార్‌లో జేడీయూ - ఆర్జేడీ కూట‌మిని అధికారంలోకి తీసుకు వ‌చ్చారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కు ప‌ని చేసి స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత పంజాబ్‌, ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా పీకే స్ట్రాట‌జీస్ట్ గా ప‌ని చేశారు.

త‌మిళ‌నాడులో స్టాలిన్ తో పాటు బెంగాల్లో మ‌మ‌త‌కు కూడా ప‌నిచేసి వారిని అధికారంలోకి తీసుకు వ‌చ్చారు. బెంగాల్లో మ‌మ‌త గెలుపు కోసం పీకే ఏకంగా మోడీతో స‌వాల్ చేసి మ‌రీ విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు దే శ వ్యాప్తంగా ప‌లు ప్రాంతీయ పార్టీల‌కు పీకే శిష్యులు స్ట్రాట‌జిస్టులుగా ప‌ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కు పీకే శిష్యుడు రాబిన్ శ‌ర్మ ప‌ని చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త పార్టీ పెడుతోన్న ష‌ర్మిల‌కు కూడా పీకే శిష్యురాలే కొత్త వ్యూహకర్త గా ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఆమె కూడా పీకే శిష్యురాలే కాగా త‌మిళ‌నాడుకు చెందిన ఆ వ్యూహ‌క‌ర్త పేరు ప్రియ‌. ష‌ర్మిల మ‌హిళ కావ‌డంతో ఆమె వ్యూహాత్మ‌కంగా మ‌హిళా వ్యూహ‌క‌ర్త‌నే ఎంపిక చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రియ కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్య‌క్తే. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. ఆమె ఈ రోజు లోటస్ పాండ్ లో షర్మిషలను కలిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ వ్యూహాలపై షర్మిలకు వ్యూహకర్తగా ప్రియ‌ వ్యవహరించనున్నారు. ఆమె త‌మిళ‌నాడులో  ఓ మీడియా అధినేత కూడా..!  మ‌రి ప్రియ వ్యూహాలు ష‌ర్మిల‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: