ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్రూం రాలేదు అన్న కారణంతో ఎంతోమంది మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు అన్న మనస్తాపంతో ఓ యువకుడు చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి అంటూ గౌతం అనే యువకుడు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.
దీనికి సంబంధించి ఎల్లారెడ్డిపేట లో అటు అధికారులు సర్వే కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు ఇక డబుల్ బెడ్ రూం ఇండ్ల అర్హుల జాబితాలో గౌతమ్ పేరు చేర్చారు. కానీ తుది జాబితా విషయానికొచ్చేసరికి గౌతమ్ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఎంతగానో మనస్తాపం చెందాడు. పది రోజుల నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయాడు. తనకు ఇల్లు రాదు అని నిర్ణయించుకున్నాడు. దీంతో మనస్తాపంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడంతో ఇక అతని కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి