ఇలా అందరూ అవేర్నెస్ పెంచేందుకు పలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇటీవల కాలంలో అయితే సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి వాహనదారులకు అందరికీ అవగాహన కల్పించే విధంగా కొన్ని పోస్టులు చేసిన ఘటనలు తెర మీదికి వచ్చాయి. ఇక్కడ ఇటీవలే మరో సారి ఒక వీడియో ని పోస్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవలే పోస్ట్ చేసిన వీడియో లో మద్యం మత్తులో వాహనం నడిపితే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేసే విధంగా ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసాడు.
ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పొద్దున పొద్దున్నే మద్యం తాగాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే మద్యం మత్తులో బైక్ నడిపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అదుపుతప్పి బొక్క బోర్లా పడిపోయాడు. ఇక రోడ్డుపై వెళ్తున్న ఓ మానవత్వం ఉన్న వ్యక్తి ఇక అతని లేపాడు. ఆ తర్వాత అయినా అతను సవ్యంగా వెళ్తాడు ఏమో అని అనుకున్నాడు. కానీ బండి స్టార్ట్ చేసిన అతను హైవే మొత్తం తనదే అన్నట్లుగా వెళ్ళిపోతున్నాడు. ఒక సారి రాంగ్ రూట్లో వెళ్లడమే ఇంకోసారి కార్లకి అడ్డు వెళ్లడం లాంటివి చేశాడు. ఈ వీడియో చూస్తుంటే అందరికీ అతనికి ఏమవుతుందో అని ఒకింత భయం వేస్తుంది. ఇలా మద్యం మత్తులో బైక్ నడిపితే అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి