దివంగత వైయస్ రాజశేఖర్... గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి... ఒక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత రాజశేఖరరెడ్డిది. అయితే ఆయన కుటుంబం కూడా రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కలహాలు తారా స్థాయికి చేరాయి. ఎంతలా అంటే రాజశేఖర్ రెడ్డి సమాధి ని సైతం రాజకీయాలకు వాడుకునే అంత గా మారిపోయాయి. జూలై 8 న దివంగత రాజశేఖరరెడ్డి జయంతి. ఈ రోజున ప్రతిసారి ఇడుపులపాయలోని వైఎస్ సమాధి దగ్గరికి కి కుటుంబ సమేతంగా... వచ్చి ప్రార్థనలు చేస్తారు. 

అయితే ఈసారి దానికి విరుద్ధంగా అన్నా చెల్లెలు ఇద్దరు వేర్వేరు సమయాల్లో... ఇడుపులపాయ కు వచ్చారు. అంటే దీన్ని బట్టి తెలుస్తోంది.. జగన్ మరియు షర్మిల మధ్య వివాదాలు ఏ స్థాయికి చేరాయో. జూలై 8 న మొదటగా వైయస్ భారతి ఇడుపులపాయ కు చేరుకొని రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించారు. ఆ తరువాత విజయమ్మతో కలిసి  షర్మిల వచ్చారు. ఇక షర్మిలా మరియు విజయమ్మ ఇడుపులపాయ నుంచి వెళ్లినట్లు సమాచారం తెలుసుకున్న తర్వాత.. సాయంత్రం పూట ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. తండ్రికి నివాళులు అర్పించారు. ఈ ఘటన చూసి..  అటు వైఎస్ అభిమానులు, ఇటు ప్రజలు  షాక్ కు  గురయ్యారు. తండ్రి సమాధి వద్ద... కూడా జగన్, షర్మిల కలిసి రాక పోవడం తో ఎంతో కలత చెందారు. ఇంత జరుగుతున్నా వైఎస్ విజయమ్మ ఎందుకింత గమ్ముగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు.

 సందెట్లో సడేమియా.. రాజశేఖర్ రెడ్డి సమాధి పై... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తల దూర్చాడు. కుటుంబ సభ్యులంతా... జగన్ ను ఒంటరి చేస్తున్నారని... అందుకే సమాధి వద్దకు వేర్వేరు సమయాల్లో వచ్చారు అని చెప్పుకొచ్చాడు. జగన్ షర్మిల వివాదంలో విజయమ్మ... తన సపోర్ట్ ను కూతురికే ఇస్తుంది అంటూ రాసుకొచ్చాడు. జగన్ వద్దన్నప్పటికీ... షర్మిల పార్టీ ఆవిర్భావం లో విజయమ్మ ప్రసంగించి ఉందని రాధాకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఏది ఏమైనా  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున.... జగన్ మరియు షర్మిల మధ్య వివాదాలు మరోసారి బయట పడటం వాస్తవం.ఇందులో భాగంగానే షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టినట్లు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: