ప్రస్తుతం ఆన్లైన్ యుగం నడుస్తుంది. ఏది కావాలన్నా కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. చివరికి వరుడు వధువు  కావాలన్నా కూడా ఆన్లైన్లోనే ప్రకటనలు ఇస్తున్నారు నేటి రోజుల్లో. ఇక ఇలా ఆన్లైన్లో వరుడిని వెతికి పెట్టడానికి ఎన్నో మాట్రిమోనీ లు కూడా తెర మీదకు వస్తున్నాయి. అప్పుడైతే ఇక  ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ సంబంధం తీసుకురావడం.. ఇక ఒకరి ఇంటికి ఒకరు  వెళ్లి మంచిచెడులు మాట్లాడుకోవడం ఒకరిని ఒకరు చూసుకోవడం ఆ తర్వాత ఒకరిని ఒకరు నచ్చడం లాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఆన్లైన్లో వరుడు వధువు కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటే ఇక వాటిని చూసి ఓకే చేయడమే.


 అయితే నేటి రోజుల్లో కేవలం ఆన్లైన్లో వరుడు వధువుని వెతకడమే కాదు ఏకంగా బాయ్ ఫ్రెండ్ కూడా ఆన్లైన్లోనే దొరుకుతూ ఉండడం చూస్తున్నాం. ఎంతోమంది ప్రస్తుతం అద్దెకు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకు కూడా తీసుకుంటున్నారు.అయితే మనదేశంలో ఇలాంటి కల్చర్ లేదు. కానీ ఇక విదేశాల్లో మాత్రం ఇలాంటి కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఎంతో మంది తమకు కావాల్సిన సమయంలో కొన్ని గంటలపాటు బాయ్ ఫ్రెండ్ ని అద్దెకు తీసుకుంటారు. ఇలా బాయ్ ఫ్రెండ్ ని లేదా గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే ఒక కోడలు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా వృద్ధురాలైన తన అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది.



 అంతే కాదు ఇక తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా వచ్చే వ్యక్తికి భారీ మొత్తంలో చెల్లించేందుకు కూడా ఆ కోడలు సిద్ధం కావడం గమనార్హం. అమెరికాలోని ఓ కోడలు ఇలా అత్త కోసం కొత్త బాయ్ ఫ్రెండ్ ను  వెతికే పనిలో పడింది. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన కోడలు తన 51 ఏళ్ల అత్తయ్యతో కాస్త సమయం గడిపి వారితోపాటు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న ఒక బాయ్ ఫ్రెండ్ అద్దెకు కావాలంటూ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. దీని కోసమే కదా 940 డాలర్లు అంటే మన కరెన్సీలో 72000 చెల్లిస్తా అంటూ ప్రకటించింది. ఇలా అద్దెకు బాయ్ ఫ్రెండ్ గా వచ్చే వ్యక్తికి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు డాన్స్ బాగా వచ్చి ఉండాలి అని షరతు కూడా పెట్టింది ఆ కోడలు. ఇక ఈ ప్రకటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: