పంజాబ్ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ ఉత్కంఠకు తెరదించుతూ సోనియా గాంధీ మాజీ ఇండియన్ క్రికెటర్ మరియు పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దుని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో ఇక్కడ విబేధాలు సద్దుమణుగుతాయని భావించినా, ఇప్పుడు అవి మరింత కఠినంగా మారుతున్నాయి. సిద్దు నియామకాన్ని పంజాబ్ సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ పూర్తిగా ఖండిస్తున్నారు. పార్టీలో ఎంతో విశ్వాసంగా ఉన్న ఎంతోమంది నాయకులను కాదని సిద్దుకి ఇవ్వడంపై పూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు సిద్దు పార్టీ కార్యకర్తలను మరియు నాయకులను గోల్డెన్ టెంపుల్ కు రమ్మని చెప్పగా, ఆశ్చర్యకరంగా సిద్దు ఇంటి దగ్గరకు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చారు.

అంతే కాకుండా అమృత్ సర్ ప్రాంతమంతా సిద్దు బ్యానర్ లతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా పాల్గొనడం విశేషం. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మదన్ లాల్ జల్ పూర్ మాట్లాడుతూ రానున్న పంజాబ్ ఎన్నికలలో సిద్దు నాయకత్వంలోనే కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపారు. సిద్దు పీసీసీ అధ్యక్షుడు కావడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలు కూడా సిద్దూనే కావాలని అనుకుంటున్నారని సంచనలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అమరీందర్ సింగ్ కు సీఎం నుండి ఉద్వాసన తప్పేలా లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

అంతే కాకుండా ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం అమరీందర్ సింగ్ పాత విషయాలన్నీ వదిలి పెట్టి, కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన సిద్ధుని కలిసి అభినందించాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయటానికి ఇద్దరూ కలిసి పనిచేయాలన్నారు. కానీ అమరీందర్ సింగ్ మారేలా కనిపించడం లేదు. దీనిని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ సీఎం అవడం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: