వర్షాకాలం ప్రారంభం అయ్యిందో లేదో ప్రస్తుతం పలు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో  అయితే వర్షాలు ఏ రేంజ్ లో కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల మొత్తం తడిసి ముద్దవుతున్నాయ్.  ఇలా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో కాస్త వర్షం తగ్గితే బాగుండు బయటికి వెళ్లి వచ్చే వాళ్లం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.  అంతలా వర్షాలు కురుస్తున్నాయి  అంతేకాదు కొన్ని చోట్ల ఏకంగా రైతులు వేసిన పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.


 ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలలో మాత్రం వర్షాకాలం ప్రారంభమైన రోజులు గడుస్తున్నా ఇంకా వర్షాలు లేక ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు   ఇక పలు రాష్ట్రాలలో రైతులు వర్షపు చుక్క కోసం ఇంకా దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. అయితే వర్షాలు కురవకపోతే ఇక వివిధ రకాలుగా ప్రయత్నించి వర్షాలు కురవాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు అనేది తెలిసిందే. చాలా మటుకు అయితే వర్షాలు కురవకపోతే ఏకంగా ఊర్లలో కప్పల పెళ్లి చేయడం లాంటివి చేస్తూ ఉంటామ్. ఇక మరికొన్ని రకాల సాంప్రదాయాలను కూడా పాటిస్తూ ఆ దేవుడిని వర్షాలు కురిపించాలని అంటూ ప్రార్ధిస్తూ ఉంటారు.



 కానీ ఇటీవలే మధ్య ప్రదేశ్లో మాత్రం ఏకంగా వినూత్నంగా వర్షాలు కురవాలని దేవుని ప్రార్థించారు. వర్ష కాలం ప్రారంభమైన మధ్యప్రదేశ్లో ఇంకా వర్షపు చినుకు పడలేదు. ఈ క్రమంలోనే ఇటీవలె విదీష జిల్లా రంగైల్లో ఏకంగా సర్పంచ్ ను గాడిదపై ఊరేగించారు గ్రామస్తులు  ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది . గాడిదపై ఊరంతా ఊరేగించి తరువాత ఇక ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదేంటని అక్కడి సర్పంచులు ప్రశ్నించగా ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమని కొత్తగా ఏం రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యప్రదేశ్లో మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడటం లేదు అని చెప్పుకొచ్చారు ఆ సర్పంచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: