వామ్మో.. వామ్మో.. ఇవన్నీ పథకాలా లేకపోతే వరాల..  హుజురాబాద్ ఉప ఎన్నిక ఏమో కానీ కెసిఆర్ సారు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరికీ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి .  ఇటీవలే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు  తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ప్రజలందరిని ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తమ చేతుల్లో ఉండడంతో ఇక కావాల్సిన అస్త్రాలు అన్నింటినీ కూడా ప్రయోగిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.


 అంతకాకుండా హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారో లేదో అప్పటి నుంచి హుజరాబాద్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించడం మొదలుపెట్టారు. ఇక ఇటీవలే ఏకంగా దళిత బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో లబ్దికోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టాము అంటూ ప్రతిపక్షాల ముఖం మీద కొట్టినట్టుగానే చెప్పేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధువు ద్వారా అర్హులైన వారికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కెసిఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం ఎంతో సంచలనంగా మారిపోయింది. అయినప్పటికీ కెసిఆర్ మాత్రం సంతృప్తి చెందలేదు అన్నది తెలుస్తుంది.



 దీంతో ఇక ఇప్పుడు మరో హామీకి కూడా సిద్ధమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల దళిత బంధు సదస్సులో పాల్గొన్న ఆయన కీలక ప్రకటన చేసి అందరిని మరో సారి షాక్ కి గురి చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఇల్లులేని దళిత కుటుంబం ఉండకూడదు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు   ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అంటూ తెలిపారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు  రాష్ట్రం లోని దళితవాడలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న దళితులు అందరికీ కూడా ప్రభుత్వమే వైద్య సాయం అందిస్తోంది అంటూ సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: