ఒక ఏడేళ్ల పాప మామూలుగా మన ఇంట్లో ఉంటే ఏమి చేస్తూ ఉంటుంది. ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మ వెనక తిరుగుతూ ఉంటుంది. రాతిరి సమయంలో అమ్మ చందమామను చూపిస్తూ అన్నం పెడుతుంటే, ఆ పాప ఆకాశంలోని నక్షత్రాలు చూసి ఇవన్నీ ఎంత బాగున్నాయి అనుకుంటూ ఆశ్చర్యపోతుంది. అయితే మనము ఇప్పుడు తెలుసుకోబోయే ఒక పిల్ల పిడుగు మాత్రం ఆకాశం చూసి ఆశ్చర్య పోవడం కాదు. ఆకాశంలోని గ్రహాల రహస్యం తెలుసుకోవాలి అని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆ గ్రహాల కోసం గ్రహశకలాల్ని కనిపెట్టింది. ఆ అమ్మాయి ఎవరో కాదు బ్రెజిల్ కు చెందిన ఓ చిన్నారి ఏడేళ్ల వయసులోనే అమెరికా అంతరిక్ష పరిశోధన అయినటువంటి నాసా కొరకు ఏకంగా ఏడు గ్రహ శకలాలను కనిపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆ మధ్య కాలంలో ఇంటర్నెట్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబరేషన్ ...ఈ మధ్య ఆస్టరాయిడ్ హంట్ అనే సరికొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇది సిటిజన్ సైన్స్ కార్యక్రమం. ఇందులో ఆసక్తిగల ప్రజలు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. అయితే అందర్నీ అబ్బురపరిచే విధంగా బ్రెజిల్ కు చెందిన ఏడేళ్ల చిన్నారి ఒలివిరా ఏడు గ్రహ శకలాలను కనిపెట్టి నాసాకు సహాయపడి, పెద్ద పెద్ద సైంటిస్ట్ లను సైతం అబ్బుర పరిచింది. ఇందుకు నాసా సైంటిస్ట్స్ ఒలివిరాకు సర్టిఫికేట్ ను కూడా ఇచ్చారు. ఈ పాప రెండేళ్ల వయసులోనే తల్లిని నక్షత్రం  చూపించి అది కావాలి అందట. దాంతో తన చిన్నారి ఆసక్తిని గుర్తించి నక్షత్రం బొమ్మను కొని తనకు గిఫ్ట్ గా ఇచ్చింది.

కానీ ఆ చిన్నారి మాత్రం దాన్ని బొమ్మగా చూడలేదు.  అంతరిక్షం గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంది దానిపై పట్టు సాధించింది ఇంత చిన్న వయసులోనే స్కూల్స్ లో ఆస్ట్రానమీపై సెమినార్స్ ఇస్తుంది అంటే తనకు దానిపై ఉన్న అవగాహన ఎంతో అర్థమైపోతుంది.   బ్రెజిల్ దేశ ప్రభుత్వంలో  సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ చిన్నారి బాలిక ఒలివిరను తమ దేశంలో జరగనున్న తొలి ఇంటర్నేషనల్  ఆస్ట్రానమీ అండ్ ఏరోనాటిక్స్ సెమినార్ లో మాట్లాడాలని కోరుతూ ఆహ్వానం తెలిపింది. ఇంతటి గుర్తింపు పొంది చిన్న వయసులోనే ఇన్ని ప్రసంశలను అందుకుంటున్న ఆ చిన్నారి తల్లితండ్రులు నిజంగా అదృష్ట వంతులు. ఆల్ ది బెస్ట్ ఒలివిరా ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్...

మరింత సమాచారం తెలుసుకోండి: