విశాఖపట్నం లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నామని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారాన్ని కొనాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆగ్నేసియా మార్కెట్ల తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న టాటా స్టీల్‌కు ఆయా మార్కెట్లకు మరింతగా చేరువయ్యేందుకు సముద్ర తీరంలో ఉన్న విశాఖ ఉక్కు ప్రయోజనకరం గా ఉంటుందని టి.వి. నరేంద్రన్ అంటున్నారు.
ఇప్పటికే మొత్తం 6 ప్రభుత్వరంగ సంస్థల వాటాలున్న ఒడిస్సా లోని నీలాంచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ను కూడా కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఇప్పటికే నిర్ణయించిందని టి.వి. నరేంద్రన్ తెలిపారు. నీలాంచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ తో పాటు విశాఖ ఉక్కు ను కొనుగోలు చేయాలని టాటా స్టీల్ ఆసక్తిగా ఉందని నరేంద్రన్ తెలిపారు.
విశాఖ ఉక్కు కొనుగోలు పై ఇప్పటికే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయిలో కసరత్తు చేశామని.. కొనుగోలు ప్రక్రియ లో తాము పాల్గొంటున్నామని నరేంద్రన్ తెలిపారు. దీనిపై సరైన సమయంలో దీనిపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి