తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం తరువాత కొన్ని మాటలు వినిపించాయి. షర్మిల తొలి ప్రెస్మీట్ అందుకు కారణం అయింది. విలే కరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా కేటీఆర్ ఎవరు అని ఎదురు ప్రశ్నించారు. ఇంతకూ కేటీఆర్ ఎవరు? పోనీ ఈ తగాదా ఎందు కు షర్మిల ఎవరు ? రాజ్యంలో అధికార సాధనే ధ్యేయంగా మున్ముందుకు అడుగులు వేసే నాయకులకు ఎవరేంటో తెలియకుండా నే రాజకీయాలు చేయడం విడ్డూరం. ఈ నేపథ్యంలో ఇంంతకూ వైఎస్సార్టీపీ ఎందుకు అని ప్రశ్నిస్తే.. విడిపోయిన ప్రాంతంలో కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది.?
కేటీఆర్ ఎవరు..తెలంగాణ మంత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు. ఈ రెండూ కాకుండా ఆయన బాగా చదువుకున్న వాడు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న లీడర్..మరి! షర్మిల..ఇంకా ఆరంభంలో ఉన్న పార్టీకి నేత. సరైన క్రియాశీలక నిర్ణయాలు లేని పా ర్టీకి అధినేత్రి. కొంత కాలం జగనన్న పార్టీకి అండగా నిలిచిన నేత. ఇంకా చెప్పాలంటే తెలంగాణతో అస్సలు సంబంధం లేని నేత. ఆ మె పార్టీ ఆరంభించి ఇక్కడ నేతలను ప్రశ్నిస్తూ పోతే బాగుండు. కానీ అలా కాకుండా ఆమె చెప్పిన మొదటి మాటే అనేక వివాదా లకు కారణం అయింది. టీఆర్ ఎస్ ట్రోల్ చేసింది అందుకే. అయినా కూడా ఆమె తగ్గలేదు. మొన్న కేసీఆర్ పుట్టిన్రోజున కూడా ఏ వో ట్వీట్లు చేశారు. నిరుద్యోగ సమస్యలు దమ్ముంటే పరిష్కరించాలని సవాల్ చేశారు. చేస్తూనే కొన్ని పేపర్ క్లిప్పింగులు యాడ్ చే శారు. ఈ పరిణామంతో వివాదం ఇంకా వేడెక్కిపోయింది. ఇవన్నీ అపరిపక్వ ధోరణులే. నిరుద్యోగ దీక్ష పేరిట ఆమే చేస్తున్న హడా వుడి కూడా తెలంగాణ సమాజం పట్టించుకుంటుందా అంటే అనుమానమే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి