ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వైయస్ షర్మిల.  ఆంధ్ర పాలకులు మాకు వద్దు అంటూ అన్ని పార్టీలు విమర్శిస్తున్నపుడు  నేను తెలంగాణ కోడలిని నాకు ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉంది అంటూ చెప్పి విమర్శకుల నోళ్లు మూయించింది. మళ్లీ తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటూ శబదం చేసింది.  ఇక నిరుద్యోగుల తరఫున పోరాటం మొదలుపెట్టింది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అనే ఒక కొత్త పార్టీని స్థాపించింది.  ప్రస్తుతం పార్టీ బలోపేతానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది.



 అయితే ఇక రానున్న రోజుల్లో షర్మిల ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి తండ్రి సెంటిమెంట్ తోనే తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని షర్మిల భావిస్తున్నట్లు  టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇక పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కూడా షర్మిల సిద్ధమవుతోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే జేఏసి అధినేత కోదండరాం  సహన అటు మాజీ ఐపీఎస్ బిఎస్ పి  నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి షర్మిల ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.



 అయితే ఒకవేళ నిజంగానే ప్రచారం జరిగినట్లుగా షర్మిల అటు కోదండరాం, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితే మాత్రం రానున్న రోజుల్లో షర్మిల పార్టీ చిత్తుచిత్తుగా అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే షర్మిల కొత్తగా పార్టీ స్థాపించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కొంతపట్టు ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే షర్మిల పార్టీకి ఏమైనా కలిసొస్తుందని కానీ..  ఇప్పటికే మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే షర్మిల పార్టీకి మైనస్ తప్ప ప్లస్ అయ్యేది ఏమీ ఉండదు అంటూ చెబుతున్నారు విశ్లేషకులు.  రానున్న రోజుల్లో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: