తెలంగాణ ఉద్యమం నుంచి  తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కెసిఆర్ వెన్నంటే ఉండి నడిపించిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. ఆయన వ్యూహాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే  తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వివరించిన వ్యక్తి ఆయన. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేశాడు. చివరికి రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  కెసిఆర్ కోదండరాముని పక్కకు పెట్టేశారు. దీంతో ఆయన విసుగుచెంది  తెలంగాణ జన సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. పోయిన ఎలక్షన్లలో  పార్టీ అంతగా ముందుకు రాలేకపోయింది. ఇప్పుడు కూడా కాస్తోకూస్తో కార్యకర్తలతో ముందుకు నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈ పార్టీ యొక్క ప్రధాన నినాదం తెలంగాణ వాదం. ఈ పార్టీ లక్ష్యం కూడా తెలంగాణ అభివృద్ధి ధ్యేయం.

 అయితే  ఒక రాష్ట్రం బేస్ మీద ఏర్పడిన ఈ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  కొత్త పార్టీ పెట్టిన షర్మిల పార్టీని నమ్ముతారా. వైయస్సార్ టీపీ తో పొత్తుకు ఒప్పుకుంటారా.. ఒక రకంగా చూస్తే  ఆయన దీనికి విముఖత చూపే అవకాశం ఎక్కువ. ఒకవేళ ఒప్పుకున్న  ప్రజల్లో కాస్తోకూస్తో ఉన్న జన సమితి ఇంకా దిగజారిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే  ఇప్పటికీ వైయస్ షర్మిల తెలంగాణలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరుతో మాత్రమే ప్రచారం చేస్తోంది. ఇప్పటికీ ఆమెను, ఆ పార్టీని ఆంధ్ర పార్టీ లాగానే  తెలంగాణ ప్రజలు చూస్తున్నారని చెప్పవచ్చు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పాలన వస్తుందని  భావిస్తున్న ప్రజలు  షర్మిలను నమ్మకపోవచ్చు.

 ఈ తరుణంలో  కోదండరాం ఒకవేళ షర్మిలతో పొత్తు పెట్టుకుంటే  ప్రజలు ఆయనను విశ్వసించారు. ఎందుకంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కోదండరామ్ కాబట్టి, మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ నాయకులతో పోత్తు పెట్టుకుంటున్నారని ఇతర పార్టీలు కోదండరామును నిందించే అవకాశం ఉంది కాబట్టి, దీని ద్వారా ప్రజల్లో ఆయనకున్న గౌరవం పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. మరి ఎన్నికల సమయానికి ఈ విషయాలను  కోదండరామ్ గమనిస్తారా..  లేదా షర్మిలతో దోస్తీకి ముందడుగు వేస్తారా అనేది మన ముందు ముందు చూడాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: