ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజా ముఖ్యమంత్రిగా ఉంటూ తన పాలనతో తన నిర్ణయాలతో ఎన్నో అద్భుతాలను సృష్టించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అయితే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగుల పట్ల కూడా వైయస్ రాజశేఖర్రెడ్డి చూపించే గౌరవం ఆప్యాయత ఎనలేనిది అనే చెప్పాలి. ఇలా వైయస్ రాజశేఖర్రెడ్డి ఎంతో గొప్పవాడు అనే విషయాన్ని చెప్పడానికి ప్రస్తుతం మనం మాట్లాడుకునే ఘటన నిదర్శనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పేదవాడికి కష్టం వస్తే లెక్కలు చూడటం కాదు మొదట ఆకలి తీర్చాలి అన్న నినాదంతో ముందుకు సాగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయంలో ఐదవ అంతస్తులో వైయస్ కార్యాలయం ఉండేదట. ఇక ఆయన కార్యాలయానికి వెళ్లడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కోసం ఒక ప్రత్యేకమైన లిఫ్ట్ కూడా ఉండేదట. వైయస్ లిఫ్ట్ దగ్గరికి రాగానే అన్నిటిని కూడా లిఫ్ట్ లు ఆపేసే వారట. ఇక వైయస్ రాజశేఖర్రెడ్డి వెళ్లే లిఫ్ట్ కి ఒకే వ్యక్తి లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేసేవాడట. ఈ క్రమంలోనే ఇక ఆ లిఫ్ట్ ఆపరేటర్ కి వైయస్సార్ కి మధ్య కాస్త చనువు కూడా ఉండేదట. నవ్వుతు వైయస్సార్ లిఫ్ట్ ఆపరేటర్ పలకరించేవారట. అయితే ఓ రోజు వైయస్సార్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్న సమయంలో లిఫ్ట్ ఆపరేటర్ గా ఉన్న వ్యక్తి ఆ రూంలోకి వచ్చాడట.
ఏంటయ్యా అడుగగా ఈరోజు నా రిటైర్మెంట్ డే సార్ మా యూనియన్ ఒక పార్టీ ఇస్తుంది వెళ్తున్నాను.. చివరగా మీకు చెప్పి వెళదామని వచ్చాను అంటూ ఆ ఉద్యోగి వైఎస్సార్ తో చెప్పాడట. ఈ విషయం ఉదయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడట వైయస్సార్ . కాసేపు ఆగు అని చెప్పి ఇక వెంటనే కార్యదర్శుల కు ఫోన్ చేసి ఏకంగా శాలువా బొకే తీసుకురావాలని ఆదేశించారట. ఇక ఆ తర్వాత అతని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న వైయస్సార్.. అతనికి ఇల్లు భూమి లాంటివి లేవని.. పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని తెలుసుకుని ఏకంగా రెండు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి అందరి ముందు అతనికి శాలువాతో ఘనంగా సత్కారం చేసి బొకే ఇచ్చి ఇక రిజిస్ట్రేషన్ పేపర్లతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇచ్చి పంపించారట. మళ్లీ ఏదైనా అవసరం వస్తే అడుగు కూడా చెప్పారట వైయస్సార్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి