కానీ సగం పాలన పూర్తయితే కానీ జనాలకు తెలియలేదు, నిజమైన పాలన అంటే సంక్షేమం కాదు. అభివృద్ధి చేయడం అని, ఇప్పుడు రాష్ట్రంలో అధికార ప్రభుత్వంపై జనాల వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమం కార్యక్రమాల వలన ప్రజలు లాభపడ్డారా అంటే అదీ లేదు. నిజం చెప్పాలంటే ఇంకా సోమరులుగా తయారవుతున్నారు. ప్రతి ఇంట్లో పిల్లవాడికి అమ్మఒడి, కాలేజీ పిల్లలకు విద్యాదీవెన, రైతు భరోసా, చేయూత, ఫింక్షన్ ఇలా ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకే ఇంట్లో ఇస్తుండడం వలన సమ్వత్సరానికి ఒక ఇంట్లో పొలాన్ని పండించి ఎంతయితే సంపాదిస్తారో అంతే మొత్తంలో ప్రభుత్వం ద్వారా వస్తుంటే ఇంక పనులు ఎందుకు చేస్తారు.
అందుకే జగన్ ఇక అయినా కళ్ళు తెరిచి సంక్షేమ పధకాలను తగ్గించి ప్రజలకు ఉపాధిని కల్పించే ఫ్యాక్టరీల అభివృద్ధి పై కృషి చేయాలని పలువురు అంటున్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏ సంక్షేమం అయితే తనకు ప్లస్ అవుతుంది అని అనుకున్నారో, అదే బెడిసి కొట్టేలా ఉందని రాజకీయ ప్రముఖులు అబ్యభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనా తీరులో మార్పులు రాకుంటే ప్రజల్లో అసంతృప్తి భారీగా పెరిగిపోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. మరి జగన్ ఏమి చేయనున్నారా తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి