ప్రస్తుతం ప్రపంచదేశాలకు పెద్దన్నగా కొనసాగుతుంది అమెరికా.. ప్రపంచ దేశాలలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి మరి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాడుతూ ఉంటుంది. ఇక వ్యాపారం వాణిజ్యపరంగా కూడా అమెరికా ప్రస్తుతం అగ్ర స్థానంలోనే ఉంది. అయితే ఇక అమెరికా తర్వాత రెండవ స్థానంలో కొనసాగుతున్న చైనా ఎప్పుడెప్పుడు నెంబర్ వన్ స్థానం లో కి రావాలా ఎదురుచూస్తుంది  అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే అమెరికాను వెనక్కినెట్టి మొదటి స్థానం లోకి రావడానికి ఎన్నో దొడ్డి దారులు కూడా తొక్కుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు నెంబర్ వన్ స్థానం లోకి రావడానికి మరో ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.



 గతంలో ఆప్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అరాచకాలు సృష్టించిన సమయంలో అమెరికా తమ సైన్యాన్ని పంపించి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది.  ఈ క్రమంలోనే మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అరాచకాలు సృష్టించకుండా ఏకంగా వేల సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని దేశాలలో ఉంచింది అమెరికా. అయితే 20 ఏళ్ల తర్వాత ఇటీవలే ఏకంగా అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. అమెరికా సైన్యం ఉపసంహరించుకుంటే ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు  అల్లకల్లోలంగా మారుతాయ్ అని తెలిసినప్పటికీ జో బైడెన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ నిర్ణయం పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.



 ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ విమర్శలు కూడా చేశారు. అయితే ఇక ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ దేశం లో పాగా వేసేందుకు చైనా ప్రయత్నాలు మొదలు పెట్టింది. తద్వారా అటు మధ్య ఆసియాలో ఆధిపత్యం సాధించాలని చైనా భావిస్తోందట. రష్యా, షాంగై సెంట్రల్ ఆర్గనైజేషన్ ల ద్వారా పట్టు సాధించాలని ప్రస్తుతం చైనా కొత్త ప్లాన్ సిద్ధం చేసిందట. ఈ క్రమంలోనే అటు తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించడంపై ఇటీవలే చైనా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: