సంక్షేమానికి తప్ప ప్రాజెక్టు పనులకు నిధులే లేవని నిరాశ చెందిన క్రమంలో ఒక్కసారి ఓ ప్రతిపాదన తెరపైకి రావడం, అం దుకు తగ్గ నిధులు కూడా విడుదల కావడం అన్నది వరుసగా అలముకున్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. జగన్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి రెండున్నరేళ్లకు పిల్ల కాలువల పనులకు నిధులు ఇచ్చి ఉదారత చాటుకోవడం నిజం గానే శ్రీకాకుళం జిల్లా వాసు లకూ, రైతులకూ ఇదొక వరం. టెండరింగ్ ప్రాసెస్ పూర్తయితే ఈ ఏడాది చివర్లో పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూలై నాటికి రై తులకు అందుబాటులో పిల్ల కాలువల నీరు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే..... :
చాలా కాలం తరువాత వినిపించిన పేరు తోటపల్లి. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు ఆగిపోయాక, గత ఏడాది ఎటువంటి చ ర్యలూ లేకపోయి నప్పటికీ వీటిపై మాట్లాడే నాధుడే లేడు. రెండు జిల్లాలకూ వరదాయినిగా పేర్కొనే తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధిం చి ఎట్టకేలకు నిధులు రావడం అనూహ్యం. ఇంతవరకూ పనులు ఉంటాయో లేవో అన్న ఆందోళనలో ఉన్న రైతులకు నిజంగా ఇది శుభవార్తే!
జగన్ పాలనలో శ్రీకాకుళం అభివృద్ధి అన్నది పెద్దగా లేకున్నా తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో కాస్త వెసులుబాటు దక్కింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సాగు, తాగునీరు అందించే తోటపల్లి ప్రాజెక్టు కు సంబంధించి ఆధునికీకరణ పనులు ఎప్పుడో ఆగిపోయాయి. వైఎస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. నాబార్డు సైతం ఈ పనులకు గతంలో రుణం కింద కూడా నిధులు ఇవ్వలేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా వంశధార, తోటపల్లిపై దృష్టిసారించినా అనుకున్న ఫలితాలు అయితే దక్కించుకోలేదు. దీంతో బీజేపీ చాలా హడావుడి చేసింది. వంశధార నిర్వాసితులపై మాట్లాడింది కానీ తోటపల్లి పై మాత్రం పెదవి విప్పలేదు. ఏదేమైనప్పటికీ ఆమె అనుకున్న విధంగా రాజకీయంగా చేయాల్సిన ప్రకటనలు అయి తే చేసి శ్రీకాకుళం జిల్లా పర్యటనను ముగించుకుని వెళ్లారు. చాలా రోజుల తరువాత జగన్ ప్రభుత్వం పిల్ల కాలువల తవ్వకానికి 123.21కోట్లు విడుదల చేయడంతో రెండు జిల్లాల రైతులు సంతోషిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్యాకేజీ రెండు కింద 63.63కోట్లతో, విజయనగరంలో ప్యాకేజీ ఒకటి కింద 59.58 కోట్లతో పనులు చేపట్టేందుకు సీఎం సన్నాహాలు చేయిస్తున్నారు అని సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో 64,035 ఎకరాలు, విజయ నగరం జిల్లాలో 67,911 ఎకరాలు ప్రధాన కుడి కాలువ ద్వారా సస్య శ్యామలం అవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి