ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు మంచి వేడి మీదున్నాయి. ఒక వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం మరియు ప్రజల వ్యతిరేకత ఒత్తిడి మరియు ఇంకోవైపు సొంత పార్టీలో మంత్రి పదవుల కోసం కుమ్ములాటలు. వీటన్నింటి నడుమ జగన్ అయోమయంలో ఉన్నారు. మరి వైపు రానున్న ఎన్నికల కోసం ఏ విధంగా సంసిద్ధం కావాలో అని ఇప్పుడే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో జగన్ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే కొన్ని అంశాల విషయంలో ఖచ్చితంగా ఇబ్బంది పడుతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఆ అంశాలు ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్షేమం పేరుతో పల్లె ప్రజల మనసుల్లో రాజన్న బిడ్డగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే కొన్ని వర్గాలలో మాత్రం సంక్షేమం విషయంలో సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రవేశ పెట్టిన కొన్ని పధకాలు అందరికీ అందడం లేదనే విషయం గట్టిగా వినబడుతోంది. దీనికి జగన్ కారణంగా కాకపోయినా, స్థానిక కార్యకర్తల వ్యవహారం కారణంగానే ఇలాంటివి కొన్ని చోట్ల జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమ వర్గానికే అన్ని పధకాలు వచ్చేలా తమ చేతివాటం చూపిస్తున్నారని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత వస్తే అది పోవడానికి చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు మాజీ సీఎం చంద్రబాబు నాయడునే తీసుకోండి. 2014 లో అధికారంలో ఉన్నప్పుడు చేసిన మోసమే ఇప్పటీకీ ద్వేషిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో సంబంధిత ఎమ్మెల్యేలు చర్చించి సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిరుద్యోగం గురించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయంలో కూడా ఏదో ఒకటి చేసేయి జగన్ కనీసం కొంతవరకైనా ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాలను ఇవ్వాల్సి ఉంది. ఇక ఆంధ్రులకు ఎంతో ముఖ్యమయిన పోలవరం విషయంలో ఏమి జరుగుతోంది అనే విషయం ప్రజలకు క్లారిటీ వచ్చేలా తెలియచేయాలి. ఎట్టకేలకు అధికారంలో ఉండగానే పూర్తి చేసుకోవాలి.  రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని గత కొద్ది రోజుల నుండి రచ్చ రచ్చ జరుగుతోంది. కాబట్టి ఈ విషయంలో సత్వరమే చర్యలు తీసుకుని అన్ని రోడ్లను మరమ్మతులు చేయించాలి. పైన తెలిపిన అన్ని విషయాలను బాగా పరిశీలించి పరిష్కిరిస్తే మళ్ళీ జగనే సీఎం.

   


మరింత సమాచారం తెలుసుకోండి: