కొన్ని సంవత్సరాల క్రితం  ఊరిలో కొద్దిగా  డబ్బులు ఉన్న వారి ఇంట్లోనే టీవీ అనేది ఉండేది. టెక్నాలజీ పెరగడంతో ప్రతి వస్తువు మనకు అందుబాటులోకి వచ్చింది. పూరిగుడిసెలో కూడా తప్పనిసరిగా టీవీ అనేది ఉంటుంది. అయితే ఈ టీవీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యంగా మారింది. ఒక రోజు టీవీ రాకపోతే ఆ ఇంట్లో ఇక నిశ్శబ్దమే కొలువు తీరు తుంది. అందరూ ఏదో కోల్పోయినట్లుగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ టీవీ కూడా మన ఇంట్లో మనం ఏ వైపుకు పెట్టుకోవాలో, ఏ వైపు పెట్టుకోకూడదో అలాంటివి పాటిస్తే జీవితం బాగుంటుందని  చెబుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో వాస్తును బట్టి వస్తువులు అనేది పెట్టుకుంటేనే  వారి ఇల్లు బాగుంటుందని, ఒకవేళ అవి పాటించకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు.

అయితే టీవీ మనం ఏ వైపు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసుకుందామా..? మన ఇంట్లో టీవీనీ దక్షిణం వైపు ఎట్టి పరిస్థితులలోనూ పెట్టకూడదు. అయితే మనం ఏ పని చేసినా ఉత్తరం వైపు నుంచి చేయాలని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుకే మన టీవీని మనం దక్షిణం వైపు పెట్టుకుంటే మన వైపు ఎక్కువసేపు కలిసి వస్తుంది కాబట్టి, దీనివల్ల మీయొక్క దంపతుల మధ్య విభేదాలు కూడా వస్తాయని, ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతుంది అని అంటున్నారు. అంతేకాకుండా మనం టీవీలో కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి సినిమాలు చూడడం మంచిదని, ఉదయాన్నే రిలీజియన్ కి సంబంధించిన నమాజులు, భజనలు వంటివిచూస్తే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు.

 ముఖ్యంగా మనం ఉత్తరం వైపు టీవీ అమర్చుకుంటే, దీనివల్ల మనం టీవీని ఆఫ్ చేసిన  అందులో మిర్రర్ కనిపిస్తుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు  మన యొక్క బొమ్మ కనబడకుండా ఉండాలి. అందుకే వాటికి ఎక్కువగా కవర్ వేసి ఉంచుతారు. లేకుంటే అది నెగిటివ్ ఎనర్జీగా మారే అవకాశం ఉంది. అందుకే మనం టీవీ ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందుగా ఉత్తర దిశకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వాలి. రెండోది తూర్పు లేదా పడమర దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అయితే టీవీ అనేది మాత్రం మనం ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆ దిశలో ఎక్కువగా చూడాల్సి వస్తుంది. ఈ విధంగా ఉత్తర దిశలో టీవీని పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రవేశిస్తుంది. దీంతో వారికి ధన లాభం కూడా చేకూరుతుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: