కోవిడ్ అలర్ట్ : అట్టుడుకుతోన్న మెల్బోర్న్

అస్ట్రేలియా దేశం లోని మెల్బోర్న్ నగరం ఆందోళనకారుల నిరసన జ్వాలలతో  అట్టుడుకుతోంది. కరోనా ముందు వరకూ ప్రపంచం దృష్టిని  ఆకర్షించి ఈ నగరం ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది. పోలీసులు, ప్రజలకు మధ్య ప్రచ్ఛన్న యుద్దం జరుగుతోంంది. వేలాది మంది ప్రజలు వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. పరిస్థితి  సద్దు మణగక పోవడంతో రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగించారు. ఇక్కడ జరుగుతున్న గందర గోళ  పరిస్థితులను మీడియా చిత్రీకరిస్తుండటంతో పాత్రికేయ సమాజం పై కూడా ఆంక్షలు విధించారు.  అంతేకాకుండా మెల్బోర్న్ నగరం  నో ప్లై జోన్ గా కూడా ప్రకటించారు. ఆ నగరం పై విమానాలు, హెలికాఫ్టర్ లు కూడా ప్రయాణించ డానికి వీలులేదు.  ఇంటర్ నెట్ సదుపాయాన్ని కూడా కట్ చేస్తామని ప్రభుత్వ యంత్రాం పరోక్షంగా సూచనలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతంది.

కోరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతున్న మహానగరాల జాబితాలో మెల్బోర్న్ కూడా ఒకటి. ఇప్పటి వరకూ ఇక్కడ కోవిడ్-19 అదుపులోనికి రాలేదు. కోవిడ్ ను అదుపు చేసేందుకు  అదికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఏవీ సఫలం కాలేదు. దీంతో లాక్ డౌన్ విధించింది అక్కడి యంత్రాంగం. దీనిని ప్రజలు కొంత కాలం భరించారు. వారి ఓపిక నశించింది.  జైలు జీవితం లాగా ఎంత కాలం లాక్ డౌన్ జీవితం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  మెల్బోర్న్ నగరంలో ఉండే వారంతా తప్పని సరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని నిబంధన విధించింది. దీనిని నగర ప్రజలు వ్యతిరేకించారు. వ్యాక్సిన్ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదని  ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.


  కాగా ప్రభుత్వం మాత్రం కోవిడ్-19 ను నివారించే  చర్యల్లో భాగంగా  క్రమం తప్పకుండా లాక్ డౌన్ విధిస్తోంది.  తాజాగా మెల్బోర్న్ నగరం ప్రపంచ రికార్డును సాధించింది. ఈ ఏడాది లో 235 రోజులు  లాక్ డౌన్ విధించిన నగరంగా చరిత్రకెక్కింది.  ఇప్పటి వరకూ ఎక్కు రోజులు  లాక్ డౌన్ విధించిన నగరంలో  రికార్డు సృష్టించిన అర్జెంటీనాలోని బ్రోనోస్  ఉంది. అక్కడ ఏడాదిలో 234 రోజులు లాక్ డౌన్ విధించారు. తాజాగా మెల్బోర్న్ ఈ రికార్డును అధికమించింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.  ఇది జనజీవనం పై ప్రభావాన్ని చూపింది. అక్కడి యంత్రాంగం నిర్మాణ రంగం పై కొత్త ఆంక్షలు విధించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతన్న పరిణామాలు ఐక్యరాజ్య సమితిలో సమావేశ మవుతున్న ప్రపంచ దేశాధి నేతల దృష్టిని ఆకర్షించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: