అప్పుడు దళితబంధు పూర్తి స్థాయిలో అందరికీ చేరలేదు. ఇప్పుడు దాదాపు అందరికీ అందింది. అలాగే ఈటల క్యాడర్‌ను అంతా పదవులిచ్చి కొందరిని, ప్రలోభాలు పెట్టి కొందరిని తమ వైపు లాగేసుకున్నారు. దళితులు మాత్రమే ఈటలకు సపోర్ట్ అని భావించి వారిని దళిత బంధు తో మచ్చిక చేసుకున్నారు. అలాగే హరీష్ రావ్ హుజురాబాద్ లోనే తిష్ట వేర్చుకుని కూర్చున్నారు. ఇక కేసీఆర్ ఢిల్లి వెళ్లి అక్కడి పెద్ద వాళ్లతో చేస్తున్న మంతనాల వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక రంగులు మార్చుకుంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ అనుమానాలకు తావిస్తూ రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరూ కూడా ఈటలకు సహకరించడం లేదని తెలుస్తోంది. నిజంగా ఈటలను బీజేపీ ఒంటరి వాడిని చేసిందనే ప్రచారం కూడా సాగుతోంది. అయినా, తన కాళ్ల మీద నిలబడి ఒంటరిగా ప్రచారం చేసుకుంటూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు ఈటల రాజేందర్. ఒకవేళ కేసీఆర్, బీజేపీ కలిసిపోతే ఈటలకు భవిష్యత్తు ప్రశ్నార్థకమతుందనే చెప్పాలి. ఇదే జరిగితే చివరి నిమిషంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలి లేకుంటే.. బీజేపీ లోనే చావో రేవో తేల్చుకోవాలి. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో పార్టీల్లో ఖంగారు నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి