మీడియాలో వచ్చినంత పెద్ద తగాదాలు తమ కుటుంబాల్లో లేవని స్పష్టం చేశారు. ఓ విధంగా సొంత మీడియాను వదిలి ఇటుగా రావడంతోనే ఇన్ని మంచి విషయాలు తాను చెప్పగలిగారని వైఎస్సార్టీపీ కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆస్తి తగాదాలో, మరొకటో బయటకు వెల్లడిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో అన్నది ఊహించుకునే ఆమె సమయస్ఫూర్తి చాటారని అంటున్నారు ఇంకొందరు వైఎస్సార్ అభిమానులు.
పెద్దాయన చనిపోయాక ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి..ఆ రోజు షర్మిల ఎక్కడున్నారు.. ఆ రోజు నాన్న మిస్సింగ్ వార్తను ఆమె ఎలా అర్థం చేసుకున్నారు ఇలాంటివన్నీ వివరించారు. ముఖ్యంగా కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు,తాను రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడతానని చెబితే అన్నయ్య విభేదించిన వైనం అన్నీ చెప్పారు. ఎప్పటి నుంచో అంతా అనుకున్న విధంగా ఉమ్మడి ఆస్తుల విభజనలోనూ, అదేవిధంగా వ్యాపార సంబంధ పెట్టుబడుల్లోనూ వచ్చిన విభేదాలు అన్నీ అన్నీ వివరించారు.
వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన కుటుంబానికి సంబంధించి ఎన్నో ఆసక్తిదాయక విషయాలు చెప్పారు. ఆంధ్రజ్యోతి సంస్థల యజమాని ఆర్కే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను దాచి పెట్టారు. కొన్ని విషయాలకు సంబంధించి తగిన కారణాలు వివరించి అంగీకారం చెప్పారు కూడా! తమ కుటుంబం కూడా అన్ని కుటుంబాల్లాంటిందేనని అన్నారు. నాన్నకు దగ్గరగా తాను పెరిగానని, అప్పట్లో రాజకీయాలపై అయిష్టత ఉందని, తన చదువుకూ, రాజకీయాలకూ అస్సలు సంబంధమే లేదని స్పష్టత ఇచ్చారు.ఇదే సందర్భంలో బాబాయి వివేకానందరెడ్డి కూతురు సునీత గురించి కూడా చెప్పారు. అదేవిధంగా పెద్దాయన కుటుంబంలో ఆస్తితగాదాలు ఉన్నాయని అంగీకారం తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి