వైద్య కళాశాలల నిర్మాణంపై సీఎం వింత ఆదేశాలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సొమ్ములివ్వకుండా సోకులెలా అని  వాపోతున్నారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే స్థలాలపై న్యాయ వివాదాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల సొమ్ములు లేకపోవడమే అసలు సమస్య. వాటిని మాత్రం ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో చెప్పడంలేదు. రాష్ట్ర ఆరోగ్య చరిత్రలోనే అద్భుతం, అపూర్వం అన్నారు. ఒకేసారి 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఈ ఏడాది మే 31న 14 మెడికల్ కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశాడు. మరో రెండు కాలేజీలను కలిపి 16 వైద్య కళాశాలలను నిర్మించాలన్నది ప్రతిపాదన.అయితే ఈ 130 రోజుల్లో కాలేజీల నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం  వాటికి నిధులు సమకూర్చేకపోవడమే. ప్రతి పనికి అప్పుల పైనే ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను రుణాధారంగా మార్చింది.

తాను సొంతంగా అప్పులు తెచ్చి కాలేజీలు కడుతుందా అంటే అదీ లేదు.ఏపీ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కి అప్పగించారు. దీని కోసం మొత్తం 13300 కోట్ల రుణం అవసరం. కాలేజీలకు ఇచ్చిన స్థలాలు తాకట్టు పెట్టడం తో సహా ఏం తిప్పలు పడతారు ఏం చేస్తారో మాకు తెలియదు. అప్పులు తెచ్చి కాలేజీలు కట్టండి అని తేల్చి చెప్పారు. కళాశాలల నిర్మాణానికి ఎంఐడీసి ఏడాదిన్నరగా చేస్తున్న ప్రయత్నమంటూ లేదు
 రుణం వస్తుందనే ధీమాతో 11 కాలేజీ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ఇప్పటికే అప్పగించాడు. రుణాల కోసం ఎమ్ ఐ డి సి అధికారులు నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రుణాల రీపేమెంట్ ఎలా చేస్తారనేది  అందులో వివరించారు. వాటిని పట్టుకొని రెండు నెలల క్రితం పలు బ్యాంకులను అధికారులు కలిశారు. ఈ సమయంలోనే అసలు విషయం బయటపడింది. మీరు అడిగిన రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చిచెప్పేశాయి. అందుకు కారణం కూడా స్పష్టంగానే చెప్పాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రుణాలకు ఇచ్చే  గ్యారెంటీ పరిమితి ఎప్పుడో దాటిపోయింది.


ఇకపై రుణాలు ఇవ్వలేమని బ్యాంకుల నుంచి సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ,ఆరోగ్య శాఖలతో జరిపిన చర్చల లో బ్యాంకులు ఇలా చేతులెత్తేశాయి. దీంతో ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కొత్త కాలేజీల నిర్మాణాలు శరవేగంగా ఎలా పూర్తి చేయాలో తెలియక అధికారులు సతమత మవుతున్నారు. 11 కాలేజీల  నిర్మాణాలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టర్లు బేస్మెంట్ వరకు సొంత ఖర్చు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి బిల్లును సమర్పిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు చెల్లిస్తే తప్ప పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: