తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన తీన్మార్ మల్లన్న ను ఓ కేసు విషయంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మన నడుపుతున్న యూట్యూబ్ ఛానల్  పై కూడా కేసీఆర్ ప్రభుత్వం పలు దఫాలుగా దాడులు చేయించింది. మల్లన్న నోరు నొక్కాలని చాలా గట్టిగానే ప్రయత్నించిందని చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితం చానల్లో తనిఖీలు చేసి రికార్డులను,హార్డ్ డిస్క్ లను కూడా సీజ్ చేశారు. దీంతో అప్పట్లో మల్లన్న అనుచరులతో కలిసి  ఆందోళనలు కూడా చేశారు. తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో ఈ విషయం పై చాలా వీడియోలు చేసి కేసీఆర్ పై విమర్శలు సంధించారు.

అయితే ఆ తర్వాత వేర్వేరు కేసుల్లో మల్లన్న అరెస్టు కావడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. మల్లన్న పై విసిగిపోయిన కేసీఆర్ ప్రభుత్వం ఓ కేసులో అరెస్టు చేయించింది. రిమాండ్ కు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో మల్లన్నకు రాజకీయ అండ కావాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ ఆయన ఒంటరిగానే పోరాటం చేశారు. ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగి టిఆర్ఎస్ ని ఓడించినంత పని చేశారు. కానీ మల్లన్నకు ఇప్పుడు పార్టీ అండ కావలసి వచ్చింది. ఈ అవసరాన్ని తమకు అనువుగా మార్చుకున్న బిజెపి నేతలు పావులు కదిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో తీన్మార్ మల్లన్న కుటుంబం బేటీ అయ్యేలా పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.ఎంపీ ధర్మపురి అరవిందుతో కలిసి అమిత్ షా తో మల్లన్న కుటుంబ సభ్యులు  దాదాపుగా 20 నిమిషాలు చర్చించారు. మల్లన్న ను అక్రమంగా అరెస్టు చేశారని విడిపించాలని కోరారు. మల్లన్న పై కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. ఈ భేటీ వెనుక రాజకీయ కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. దాదాపుగా మల్లన్న పై కేసీఆర్ ప్రభుత్వం పదికి పైగా కేసులు నమోదు చేసింది. ఒకటి తర్వాత ఒకటిగా బెయిల్ రాగానే  మళ్లీ ఏదో ఒక కేసులో అరెస్టు చేయిస్తోంది. దీంతో మల్లన్నకు బిజెపి పార్టీ వంటి అండ అనివార్యంగా మారింది. అందుకే మల్లన్న బిజెపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సొంతంగా కేసీఆర్ తో ఎలాగూ పోరాడలేనని తెలుసుకున్న మల్లన్న బిజెపిలో చేరి మరింతగా దూకుడు ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఎమ్మెల్సీ  గా పోటీచేసిన అనుభవం ఉండడంతో ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకీ వచ్చేయాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. మల్లన్న లాంటి హుషారైన వ్యక్తుల కోసం గాలం వేసి వెతుకుతున్న బిజెపి ఇప్పుడు ఆయన అవసరానికి  అక్కున చేర్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: