శశికళ, చిన్నమ్మ, పురచ్చి తాయి పరిచయం అవసరం లేని పేర్లు ఇవి. శశికళ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నారు . అన్నా డీఎంకే పార్టీ కి తానే ప్రధాన కార్యదర్శినని ప్రకటించుకున్నారు. తమిళ పాలిటిక్స్ లో రీ ఎంట్రీ  తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు హీరో విజయ్ పేరు తమిళ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తానని  ప్రకటించలేదు అయితే ఆయన అభిమానులు మాత్రం ఏకంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి వండర్స్ క్రియేట్ చేశారు. ఇలాంటి సమయంలో ఇద్దరూ రాజకీయంగా యాక్టివ్ ఐతే అరవ రాజకీయం లో ఏం జరగబోతోంది. ప్రధాన ప్రతిపక్షం స్థానం ఖాళీగా కనిపిస్తోంది. అటు శశికళకు, ఇటు విజయ్ కు ఇదే సరైన సమయమా.. ? నిజానికి తమిళ పాలిటిక్స్ అనగానే కరుణానిధి, జయలలిత ఇద్దరు పొలిటికల్ లెజెండ్స్ గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు ఇద్దరూ లేరు.

కరుణానిధి వారసుడిగా స్టాలిన్ పార్టీలో అన్నీ తానై పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే అన్నాడీఎంకేతో పరిస్థితి వేరు. పార్టీ తర్వాత వారసుడు ఫలానా అని జయలలిత ఎప్పుడు ప్రకటించలేదు. జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ సీఎం కావాలని కలలు కన్నా, జైలు శిక్ష రూపంలో అది నెరవేరలేదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అన్నాడీఎంకేకు దాదాపు దూరమే అనుకున్న శశికళ ఇప్పుడు ఆసక్తికర ఎత్తుగడ వేశారు. ఈమధ్య అన్నాడీఎంకే 50 వ వార్షికోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నమ్మ శశికళ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అటు మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామి  పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని నడిపించాలని చూస్తున్నారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో రాణించేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

 ఏదో వ్యూహంతో చిన్నమ్మ సిద్ధంగా ఉన్నారా, అన్నాడీఎంకే ఫేస్ కాబోతున్నారా. అన్న చర్చ నడుస్తోంది. శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యి, విజయ్ ఎంట్రీ ఇస్తే అరవ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది. కానీ అన్నింటిలో రోల్ మోడల్ సీఎంగా దూసుకెళ్తున్న స్టాలిన్ కు వీరిద్దరిలో ఎవరు పోటీ ఇవ్వాలన్న రొంబ కష్టపడాలన్నది మాత్రం వాస్తవం

మరింత సమాచారం తెలుసుకోండి: