తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉపఎన్నిక వారం రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. దీనితో టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉద‌యం నుంచే ప్రచారాన్ని మొద‌లుపెడుతున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతొంది. నువ్వంటే.. నువ్వు అనే విధంగా ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్రంగానే విమ‌ర్శించుకుంటున్నారు. తాజాగా జ‌రిగిన ప్ర‌చారంలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక‌మంత్రి హ‌రీశ్‌రావు అందుకు కౌంట‌ర్‌గా స‌వాలు విసిరారు.
 
కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. డిజిల్ ధ‌ర‌, పెట్రోల్ ధ‌ర, గ్యాస్ ధ‌ర పెంచ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెరిగాయి. కాబ‌టి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. ఆ నిర్ణ‌యం ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ది కాదు. అప్ప‌ట్లో మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు తీసుకున్న‌ది.  మ‌న్మోహ‌న్‌సింగ్ తీసుకున్న‌ప్పుడు కేసీఆర్ కేంద్ర‌మంత్రివ‌ర్గంలో ఉన్నారు. అప్పుడు  కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు హ‌రీశ్‌రావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దీనికి ప్ర‌ధాన కారకులు ఎవ‌రైనా ఉన్నారంటే టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అని చెప్ప‌వ‌చ్చు అని కేంద్ర‌మంతి కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

హ‌రీశ్‌రావు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇస్తూ.. ఈ ప‌న్నులు పెర‌గ‌డానికి మాకు సంబంధం లేదు.  కేంద్రం పెంచితే పెరిగింది. త‌గ్గిస్తే త‌గ్గింది అని రాష్ట్రమంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచేది కేంద్ర‌ప్ర‌భుత్వం కాదా అని ప్ర‌శ్నించారు. నేను చాలెంజ్ చేస్తున్నా. కేంద్ర బ‌డ్జెట్ పుస్త‌కాలు తీసుకొని రండి.. ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తాన‌ని హ‌రీశ్‌రావు స‌వాలు విసిరారు. ప‌చ్చి అబద్దాలు మాట్లాడి త‌మ స్థాయిని దిగ‌జార్చుకోవ‌ద్ద‌ని పేర్కొన్నారు. సిలిండ‌ర్ మీద రాష్ట్ర ప్ర‌భుత్వం అస‌లు ప‌న్ను విధించ‌నేలేదు. సిలిండ‌ర్ ధ‌ర నేడు రూ.1000 కావ‌డానికి కార‌ణం కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే అని స్ప‌ష్టం చేశారు. దానిని త‌గ్గించాల‌ని కోరితే  రాష్ట్రంలో 291 ఉంది దానిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వమే త‌గ్గించాల‌ని పేర్కొంటున్నారు. ఇదిక్క‌డి న్యాయం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హ‌రీశ్‌.  రాష్ట్రంలో 291 ఉంటే రుజువు చేస్తే రాజీనామా చేసి ఇప్పుడే ఇంటికి వెళ్తా... మీరు ముక్కు నేల‌కు రాస్తారా అని స‌వాలు విసిరారు హ‌రీశ్‌రావు.




మరింత సమాచారం తెలుసుకోండి: