గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే.. టీడీపీ మాజీ నాయ‌కుడు..(ప్ర‌స్తుతం ఆ పార్టీ త‌ర‌ఫునే ఎమ్మెల్యేగా ఉన్నారు) వ‌ల్ల‌భ‌నేని వంశీ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో చ‌ర్చ‌కు దారితీశాయి. తాను గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని.. చంద్ర‌బాబు లేదా.. లోకేష్ ఎవ‌రైనా వ‌చ్చి ఇక్క‌డ పోటీ చేయొచ్చ‌ని.. త‌న‌ను ఓడించ‌వచ్చ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.అనంత‌పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప‌రిటాల సునీత.. వారి విజ‌యానికి సార‌థ్యం వ‌హించాల‌ని కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌నే విష‌యాన్ని అత్యంత ఆస‌క్తిగా ప‌రిశీలిస్తున్నారు. నిజానికి సునీత‌.. చంద్ర‌బాబు దీక్ష స‌మ‌యంలో మాట్లాడుతూ.. కొడాలి నాని.. వంశీని కూడా తిట్టిపోశారు.

టీడీపీలో చంద్ర‌బాబు ఇచ్చిన టికెట్ల‌పై గెలిచిన వారు.. ఆయ‌న‌ను విమ‌ర్శించ‌డం.. తిట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే సీమ ర‌క్తం రుచి చూపిస్తామంటూ.. వ్యాఖ్యానించారు. నిజానికి ఇవ‌న్నీ.. ఆ స‌మ‌యానికి మాట్లాడిన మాట‌ల్లానే ఎవ‌రైనా ప‌రిగ‌ణించాలి. కానీ.. వంశీ ప్ర‌స్టేజ్‌గా తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే.. ఇది వ్యూహాత్మ‌క అడుగుగా కొంద‌రు చెబుతున్నారు. ప్ర‌స్తుతం టెక్నిక‌ల్‌గా ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. నైతికంగా.. వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నా.. సాంకేతికంగా.. అసెంబ్లీ రికార్డుల ప్ర‌కారం.. ఆయ‌న టీడీపీ స‌భ్యుడిగానే జీతం తీసుకుంటున్నారు. మ‌రి ఇప్పుడు హ‌ఠాత్తుగా ఆయ‌న రాజీనామా చేస్తాన‌ని.. ఆ సీట్లో.. లోకేష్‌ను పోటీ చేయాల‌ని అన‌డం.. త‌న‌ను ఓడించాల‌ని స‌వాల్ రువ్వ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

వంశీ.. టీడీపీని వీడి వైసీపీలోకి వ‌చ్చినా.. ఆర్తికంగా ఆయ‌న‌కు బాగా ఉందేమో.. త‌ప్ప‌.. నైతికంగా చూసుకుంటే.. ఇప్ప‌టికీ.. ఆయ‌న‌ను టీడీపీకి నేత‌గానే స్థానిక ప్ర‌జ‌లు ప‌రిగ‌ణిస్తుండ‌డం ఒక మైన‌స్‌. రెండు.. ఆయ‌న టీడీపీ స‌భ్యుడిగా ఉండ‌డం.. రాజీనామా చేయాల‌ని జ‌గ‌న్ చెప్ప‌క‌పోవ‌డం.. నువ్వు రాజీనామా చేయి.. అని అటు చంద్ర‌బాబు నుంచి కూడా డిమాండ్ రాక‌పోవ‌డం.. వంటి ప‌రిణామాల‌తో వంశీ స‌హ‌జంగానే మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ ఉంది. రేపు మంత్రి ప‌ద‌వుల్లో కొడాలి నానిని త‌ప్పిస్తే.. త‌న‌కు అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నారో.. ఏమో తెలియ‌దు. అయితే.. దీనికి ప్ర‌తిబంధ‌కంగా ఉన్న టీడీపీ ఎమ్యెల్యే ట్యాగ్‌ను ఆయ‌నే స్వ‌యంగా తొలిగించుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది ఒక వ్యూహంగా చెబుతున్నారు.

ఇక‌, ఇదే స‌మ‌యంలో వంశీ కొన్నాళ్లుగా ఆరోపిస్తున్న‌ట్టు.. లేదా.. టీడీపీని విడిచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న లోకేష్‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలో ఈ విమ‌ర్శ‌లు.. ఇప్పటికీ వినిపిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. తాను నాడు లోకేష్‌పై చేసిన విమ‌ర్శ‌లు నిజం చేసేందుకు కూడా గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేయాల‌నే స‌వాల్‌ను వంశీ రువ్వి ఉంటార‌ని అంటున్నారు. అయితే.. వఃంశీ వ్యాఖ్య‌ల‌పై అటు ప‌రిటాల సునీత కానీ.. ఇటు.. ఇత‌ర నేత‌లు కానీ..  ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. మ‌రి ఈ క్ర‌మంలో వంశీ చేసిన స‌వాల్ గాలికికొట్టుకుపోతుందా?  లేక‌.. నిల‌బ‌డుతుందా?  ఆయ‌న క‌ల సాకారం అయ్యేదెప్పుడు.. అనేది ఆస‌క్తిగా మారింది. చూడా ఏం జ‌రుగుతుందో అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: