ఆ తర్వాత నుంచి బాబుకు జ్ఞానోదయం అయ్యి...మళ్ళీ బీజేపీకి దగ్గరవ్వడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది...అందులో భాగంగానే తన రాజ్యసభ ఎంపీలని బీజేపీలోకి పంపించారనే టాక్ ఉంది. సరే ఏది ఎలా జరిగినా బాబు మాత్రం..బీజేపీకి దగ్గరవ్వడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కూడా ఢిల్లీ వెళ్ళి బాబు అదే ట్రై చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ మోడీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్లు దొరకకపోవడంతో బాబు పప్పులు ఉడకలేదని చెబుతున్నారు.
కానీ అమిత్ షా, బాబుకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పరిణామాలు కాస్త మారాయని అంటున్నారు. అలా ఫోన్ చేయడం వల్ల బాబుకు కాస్త బీజేపీ సపోర్ట్ దొరికినట్లు అయిందని విశ్లేషణలు వస్తున్నాయి. అదే సమయంలో బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు దక్కించుకోవడం కోసమే అమిత్ షా, బాబుకు ఫోన్ చేశారనే కథనాలు కూడా వస్తున్నాయి. ఏది ఎలా చేసిన అమిత్ షా, బాబుకు ఫోన్ చేయడంతో కాస్త రాజకీయం మారింది.
అదే సమయంలో బాబుని బీజేపీ దగ్గర చేసుకునే అవకాశాలు లేవు...బాబుకు దగ్గరవ్వాలని ఉన్న, బీజేపీ మాత్రం దగ్గరకు రానిచ్చేలా లేదు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు సైతం బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు...ఇప్పటికే ఏపీ ప్రజలు బీజేపీపై కోపంతో ఉన్నారు...ఇప్పుడు కలిస్తే అనవసరంగా టీడీపీకే బొక్క పడుతుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి