చంద్రబాబు రేంజ్‌కు ఆ మెజార్టీ చాలా చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అక్క డ ఓడిపోయి నట్టే అనుకోవాలి. కుప్పంలో చంద్రబాబు 1989 నుంచి ఓటమి లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అంటే 32 సంవత్సరాలుగా కుప్పం చంద్రబాబుకు కంచుకోటగానే ఉంటోంది. ఈ తరం యువ ఓటర్లు అంతా ఆయన పట్ల ఆసక్తి తో లేరు. అందుకే ఆయన గత ఎన్నికల్లో అక్కడ ఎదురు దెబ్బ తిన్నారు.
ఇక సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు జడ్పీ టీసీల్లో టీడీపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది. అయితే ఇప్పుడు మున్సిపాల్టీ కూడా పోతే బాబు పరువు మరింత పోతుంది. అందుకే అక్కడ పార్టీ కేడర్ లో జోష్ నింపేందుకు బాబు ముందుగానే ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్కడ టీడీపీ ఓడిపోతే బాబు గారి ఇమేజ్ మరింత డ్యామేజ్ అవ్వడం ఖాయం. అందుకే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చంద్రబాబు కుప్పం ప్రచారానికి ముందుగా వెళ్లి తన పతనానికి తానే రిబ్బన్ కట్ చేసుకున్నారని చర్చలు నడుస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి