కరెంటు సంక్షోభం కారణంగా ఇక చైనాలో పరిశ్రమలు మొత్తం నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి కూడా.. ఇలా చైనాలో ఏర్పడిన కరెంటు సంక్షోభం ఏకంగా రియల్ ఎస్టేట్ సంక్షోభానికి దారితీసింది. అయితే ఇక చైనాలో కరెంటు సంక్షోభం ఏర్పడటంతో చైనా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగింది . ప్రజలందరూ విడతలవారీగా కరెంటు ఉపయోగించాలి అని సూచించింది. అధిక కరెంట్ వినియోగించ కూడదు అంటూ తెలిపింది. ముఖ్యంగా లిఫ్టులు ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించకూడదు అంటూ ఆంక్షలు కూడా విధించింది ప్రభుత్వం. అయితే ఇలా సేవ్ చేసిన కరెంట్ ను అటు చిన్న తరహా పరిశ్రమలకు అందిస్తాము అంటూ తెలిపింది.
ఒకవేళ చిన్న తరహా పరిశ్రమలు కూడా మూతపడితే ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని ప్రజలకు సూచించింది చైనా ప్రభుత్వం. ఇలా చైనా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగడం తో ప్రస్తుతం కరెంట్ సంక్షోభం కాస్త గాడిన పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో తీవ్రమైన కరెంటు సంక్షోభం ఏర్పడడం తో ఉత్పత్తి తగ్గగా.. నవంబర్ ప్రారంభంలో కరెంట్ సంక్షోభం కాస్త గాడిన పడటంతో ఉత్పత్తులు పెరిగినట్లు ఇటీవలే చైనా ప్రభుత్వం తెలిపింది. ఇలా ప్రపంచ మార్కెట్లో పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి