నేటి రోజుల్లో టెక్నాలజీలో ఎంతలా మార్పులు వస్తున్నాయో అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. టెక్నాలజీ లో వస్తున్న మార్పులు ఏకంగా కొన్ని కొన్ని సార్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉంటున్నాయి.. అయితే ఇప్పుడు డ్రోన్ కెమెరా లో కూడా సరికొత్త టెక్నాలజీ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంది. ఒకప్పుడు డ్రోన్ కెమెరాలు అంటే కేవలం పెళ్లిళ్లలో మాత్రమే వాడేవారు. పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలలో డ్రోన్ కెమెరా ల ద్వారా ఎంతో అందంగా వీడియోలు తీసేవారు ఫోటోగ్రాఫర్లు. ఇలా డ్రోన్ కెమెరాలు అంటే కేవలం పెళ్లిలో వాడే కెమెరాలు మాత్రమే అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రచారాలను కవర్ చేయడానికి కూడా డ్రోన్ కెమెరాలను ఉపయోగించేవారు.


 అయితే మొన్నటి వరకు పెళ్ళిళ్ళు శుభకార్యాలు లో మాత్రమే కనిపించే డ్రోన్ కెమెరాలు ఇక ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో కొత్త రూపు రేఖలను అద్దుకొని సరిహద్దుల్లో కూడా పహారా కాస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో డ్రోన్లు సరిహద్దుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. ఏకంగా బాంబును పేల్చడానికి కూడా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తు న్నారు. ఇలా ఇటీవలి కాలంలో రక్షణ రంగం లో డ్రోన్  పాత్ర ఎంతో కీలకంగా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు డ్రోన్  లో కూడా సరికొత్త టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా రక్షణ వ్యవస్థను పటిష్టంగా మార్చే విధంగా మారిపోయింది.


 ఇటీవలే డ్రోన్ టెక్నాలజీ ఆపరేషన్స్ లో కూడా సరికొత్త విధానాన్ని కు బ్రిటన్కు చెందిన ఆయుధ తయారీ సంస్థ కనుగొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ డ్రోన్లను కేవలం రిమోట్ తో ఆపరేట్ చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం కంటితో బ్రెయిన్ తో ఆపరేట్ చేయబోతున్నారట. మనసులోని భావాలకు అనుగుణంగా డ్రోన్ పనిచేసే విధంగా సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ప్రిటి డిఫెన్స్ కంపెనీ అనే సంస్థ ఇక ఈసరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇక దీనికి సంబంధించిన ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఇక ఇలాంటివి ఉత్పత్తి చేస్తాము అని చెబుతోంది  సంస్థ

మరింత సమాచారం తెలుసుకోండి: