కంగనా ఏమంటోందంటే.. మన దేశానికి 1947లో లభించిన స్వాతంత్య్రం ఆంగ్లేయుల భిక్ష మాత్రమేనట. దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లోనేనట. ఆ మాటలు అనడమే కాదు ఇంకా సమర్థించుకుంటోంది కూడా. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సమరం జరిగిందని తనకు తెలుసని... మరి స్వాతంత్య్రం వచ్చిందని చెబుతున్న 1947లో ఏ యుద్ధం జరిగిందో.. ఎవరైనా చెబుతారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. అలా చెప్పగలిగితేనా పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానంటోంది.. అలాగే క్షమాపణ కూడా చెబుతుందట.
అంతే కాదు. 1857 పోరాటంపై ఆమె విస్తృత పరిశోధన చేసిందట. 1857 తర్వాత పరిణామాల్లో భగత్‌సింగ్, నేతాజీ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని కంగనా ప్రశ్నిస్తోంది. ఆ ఇద్దరికీ గాంధీజీ ఎందుకు మద్దతు ఇవ్వలేదని అడుగుతోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య విభజన రేఖను తెల్లవ్యక్తి ఎందుకు గీయాల్సి వచ్చిందని కంగనా ప్రశ్నిస్తోంది.. స్వాతంత్య్రాన్ని వేడుక చేసుకోకుండా భారతీయులు ఒకరినొకరు ఎందుకు చంపుకొన్నారని అడుగుతోంది.
అయితే.. కంగనా పై విమర్శలు చేసే ముందు.. అసలు మన కుర్రాళ్లు కాస్త చరిత్ర తెలుసుకోవాలి.. ఇప్పటి కుర్రాళ్లలో ఎంత మందికి స్వతంత్ర్య పోరాటం గురించి తెలుసు.. దేశానికి మొదటి ప్రధాని ఎవరు అని అడిగితే సరిగ్గా చెప్పలేని వాళ్లు ఎందరో.. మరి అలాంటి వాళ్లంత కంగనాకు సమాధానం చెప్పేందుకైనా మన చరిత్ర గురించి కాస్త తెలుసుకోవాలి. సో.. కంగనా తన తిక్క తిక్క మాటలతో ఇలాగైనా యువతలో చరిత్ర పట్ల కాస్త ఆసక్తి కలిగిస్తుందేమో కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి