ప్రభుత్వం మీకు అవార్డును ఎందుకు ఇవ్వలేదని ఓ మీడియా ప్రతినిధి సోనూసూద్ ను ప్రశ్నించాడు. దీనిపై ఆయన నాకు అవార్డులు వచ్చినా రాకపోయినా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటా. అవార్డులు, రివార్డుల గురించి నేను అసలు ఆలోచించను. దాదాపు ఇప్పటివరకు 22వేల మంది విద్యార్థులకు సాయం చేశానని చెప్పారు. అదేవిధంగా సమకాలీన రాజకీయాలపై కూడ సోనూసూద్ స్పందించారు. పని చేసే స్వాతంత్య్రం ఎక్కడ ఉన్నా సరే నేను ఆ ప్లాట్‌ఫాంలో చేరుతాను అని ప్రకటించారు. అదేవిధంగా అన్నధాతలకు ఎల్లప్పడు నేను అనుకూలంగానే ఉంటానని, మనం తిండి తింటున్నాం అంటే దానికి కారణం వారే అని వివరించారు.
ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి సోనూసూద్ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తన సోదరి మాళవిక త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని ఆదివారం ప్రకటించారు. ఆమె పార్టీలో చేరుతున్నదనే విషయం మాత్రం చెప్పలేదు. సరైన సమయంలో ప్రకటిస్తామని వెల్లడించారు సోనూసూద్. మోగాలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సోనూసూద్ తన సోదరి రాజకీయం గురించి ప్రస్తావించారు. మరోవైపు ఆయన సోదరి మాళవిక ఇటీవలే పంజాబ్ సీఎం చరణ్‌జీత్‌సింగ్ చన్నిని కలిసారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌తో కూడ భేటీ అయ్యారు ఆమె. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టే దేశ్ కా మెంటార్స్ కార్యక్రమానికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి