అలా టీడీపీ గెలుపుకు దూరమైన నియోజకవర్గాల్లో కర్నూలులోని ఆలూరు ఒకటి. ఇక్కడ టీడీపీ చివరిసారిగా గెలిచింది 1994 ఎన్నికల్లో. అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు అక్కడ టీడీపీ గెలిచింది. ఇంకా అంతే...అప్పటినుంచి ఇప్పటివరకు ఆలూరులో టీడీపీ జెండా ఎగరలేదు. టీడీపీ గాలివీచిన 1999, 2014 ఎన్నికల్లో సైతం ఆలూరులో గెలవలేదు. ఇక 2004, 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అంటే 1994 తర్వాత ఆలూరులో టీడీపీ గెలవలేదు. ఇక 2024 ఎన్నికల్లోనే టీడీపీకి గెలిచే అవకాశం రాకపోతే...మూడు దశాబ్దాలుగా ఓడిపోతున్న రికార్డుని కైవసం చేసుకుంటుంది.
అయితే ప్రస్తుతం ఆలూరులో ఉన్న రాజకీయాన్ని చూస్తే టీడీపీకి కాస్త పట్టు దక్కుతున్నట్లే కనిపిస్తోంది. వైసీపీకి ధీటుగా టీడీపీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలూరులో టీడీపీ పికప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట ఆలూరులో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంపై అవినీతి ఆరోపణలు ఏ రేంజ్‌లో వచ్చాయో చెప్పాల్సిన పని లేదు. భూ కబ్జాలు, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, పేకాట క్లబ్బులు, ఇసుకలో దోపిడి...ఒకటి ఏంటి అనేక రకాలుగా మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. పైగా అక్కడ చేసిన అభివృద్ధి ఏమి లేదు.
వైసీపీపై నెగిటివ్ ఉండటమే టీడీపీకి ఫస్ట్ ప్లస్. పైగా చాలా ఏళ్ల తర్వాత ఆలూరులో టీడీపీకి బలమైన నాయకత్వం దొరికింది. కోట్ల సూర్యప్రకాశ్ భార్య సుజాతమ్మ...ఆలూరు టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆమె దూకుడుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆలూరులో టీడీపీని గెలిపించేలా ఉన్నారు. మొత్తానికి ఆలూరులో మూడు దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి