మాకు పదవులు ముఖ్యం కాదు.. ఒంటి చేత్తో తెలంగాణ కోసం పోరాడాం. తొంట చేయి తో  పదవులు వదులుకున్నాం. మాకు ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అంటూ టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.సీఎం త్వరలో ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంటారా? అనేది టిఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో మాదిరిగా ఆకస్మాత్తుగా ముందస్తుకు పోతారా..? అనే ప్రతిపక్షాలు అటెన్షన్ లో ఉంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఉన్నట్టుండి దూకుడు పెంచిన సీఎం వరి ని అస్త్రంగా చేసుకుని కేంద్రంపై గురి పెట్టారు. ఆయన అధికారం చేపట్టిన ఎనిమిదేళ్ల లో మొదటిసారిగా కేంద్రంపై కొట్లాటకు దిగారు.వడ్లు కొంటారా..? కొనరా..?

అంటూ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏకంగా మహా ధర్నాకు దిగారు.ప్రతిపక్ష నేతను తలపించేలా వ్యవహరించి రాజకీయ వేడిని రగిలించారు.వాస్తవానికి కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతునిచ్చిన సీఎం ఇప్పుడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో జరుగుతున్న రైతు ఆందోళనలకు బాసటగా నిలుస్తామని వెల్లడించారు.ఒకవైపు ధాన్యాన్ని కొనాలని ప్రధానికి చేతులెత్తి ప్రార్థించి మరోవైపు సమరానికి తాము సిద్ధమని ప్రకటించారు.కెసిఆర్ వ్యూహ, ప్రతివ్యూహాలు క్షుణ్ణంగా తెలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈసారి విపక్షంలో ఉండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఏ మాత్రం అలక్ష్యం గా ఉన్న సీఎం ఉన్నట్టుండి ఎన్నికల యుద్ధాన్ని ప్రకటించవచ్చని ఆయన అంతర్గతంగా పార్టీ అగ్ర శ్రేణి నాయకత్వాన్ని కి సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా ఉండి ఎన్నికలకు ఏడాది ముందు కేంద్రంపై యుద్ధం ప్రకటించి ధర్నాకు దిగారు.రాష్ట్రంతో పాటు ఢిల్లీలో కూడా నిరసన దీక్షలు చేపట్టారు. అదే తరహాలో ఇప్పుడు రెండేళ్ల ముందే కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.మరి రాజకీయంగా ఏమి జరుగుతుందో? గతంలో ఫలితాలు పునరావృతం అవుతాయా..? అన్న అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: