అసలు ఎమ్మెల్యేల లకే కాదు.. చివరకు మంత్రులు కూడా నిధులు లేవు. వారు కూడా ఓ రూపా యి సంపాదించుకు నే పరిస్థితి లేకుండా ఉంది. దీం తో ఆ మంత్రి అవినీతి, నిధుల దుర్వినియోగం, శాఖ పరమైన వసూళ్లకు పాల్పడకుండా సెటి ల్ మెంట్లు చేస్తూ నాలుగు రూపాయలు వెనకేసు కుంటున్నారట. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
తన పరిధిలో ఎక్కడ భూ సెటిల్మెంట్ ఉన్నా కూడా ఆయన టేకోవర్ చేస్తున్నారు. ముందుగానే ఆ సెటిల్ అయితే తన కు వచ్చే వాటా ఎంతో మాట్లాడు కుంటున్నారట. తన వాటాకు ఒక్క రూపాయి తగ్గినా కూడా ఆ భూ సెటిల్మెంట్ ముందుకు కదలదని చెప్పేస్తున్నారట. ఆయనకు ఇవ్వాల్సిన డబ్బులు అన్ని ముడితే ఆ సెటిల్మెంట్ ఎంచక్కా గొడవ లేకుండా ముగుస్తుందట.
ఏదేమైనా సదరు మంత్రి చాలా తెలివి అయిన వారు అని.. శాఖలో వసూళ్లకు పాల్పడకుండా, అవినీతి చేయకుండా ఇలా సెటిల్ అవుతున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే తన మంత్రి పదవి కూడా పోతుందని డిసైడ్ అయిపోయిన ఆయన కొత్త ఆదాయ మార్గాల కోసం ఈ దారులు వెతుక్కున్నారని సొంత పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి