తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని కొన్ని విషయాల్లో దూకుడుగా ముందుకు వెళుతున్న సరే కొన్ని అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాలలో సీరియస్ గా ఉండటంతో బండి సంజయ్ కాస్త రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేసినా సరే అవి పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఇక రాష్ట్రంలో బీజేపీ పై సీఎం కేసీఆర్ పోరాటం చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీతో స్నేహం చేయడం పట్ల కాస్త ఆందోళనగా ఉంది.

అయితే బండి సంజయ్ కి ఈ విషయంలో కాస్త ఆగ్రహం ఉందని తనను పోరాటం చేయమని సీఎం కేసీఆర్ ను తమ దారిలోకి కేంద్ర పెద్దలు తెచ్చుకుంటున్నారు అనే అనుమానాలు బండి సంజయ్ లో ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఇక బీజేపీ నాయకులు కొంతమంది ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడానికి కొన్ని కీలక అంశాలను ఎంచుకోవటం కూడా జరుగుతోంది. ఇక హైదరాబాద్ మేయర్ కార్యాలయం మీద బీజేపీ కౌన్సిలర్ల తాజాగా చేసిన దాడి విషయంలో అనేక కారణాలు ఉన్నాయి.

హైదరాబాద్ మేయర్ కార్యాలయం పై దాడి వెనుక కారణం ఏంటనేది తెలియకపోయినా బండి సంజయ్ సెన్సేషన్ కోసం ట్రై చేశారు అని కొంతమంది అంటుంటే బండి సంజయ్ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లిన తర్వాత హైదరాబాద్ కార్యాలయంపై దాడి జరగడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాలేదని మీడియా మొత్తం కూడా ఈ దాడి మీద ఫోకస్ చేసింది కాబట్టి దీని వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది తెలియడం లేదని కొంతమంది మీడియా ప్రతినిధులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: