ఇక ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంటును రాష్ట్రప్రభుత్వం బలంగా ఉపయోగించుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందడానికి ప్రధాన భూమిక తెరాస పార్టీ అని పార్టీ శ్రేణులు పార్టీ నాయకత్వం తరచుగా ప్రకటిస్తుంటే దశాబ్దాల తరబడిగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాల ఊసు ఎత్తకపోవడం దేనికి సంకేతం..? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సర్వాన్ని  కోల్పోయిన వారు కొందరైతే, బలిదానాలకు పాల్పడిన వారు ఎందరో..! మరెందరో..!
వీరందరినీ పక్కనపెట్టి ఉద్యమకారలందరిని తెరాస పార్టీ ప్రభుత్వము నుండి గెంటి వేసి తెలంగాణ ఉద్యమం మీద రాళ్లు విసిరి దాడి చేసిన వారికి మంత్రి మండలిలో, శాసనసభలో, శాసనమండలిలో అవకాశం ఇవ్వడం అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడమే అవుతుoది. తెలంగాణ అనే సెంటిమెంటు బలంగా మనసులో నింపుకున్న టువంటి రాష్ట్ర ప్రజానీకం ఉద్యమ కాలం నుండి నేటి వరకు కూడా మూగ భక్తిని ప్రదర్శించడం, తెరాస పార్టీ ప్రభుత్వం పట్ల గుడ్డి విధేయత ప్రకటించడం రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందకుండా చేయడమే..!

రాష్ట్రములో ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం, ప్రతిపక్షాలకు ప్రజలు మద్దతు ఇవ్వకపోవడం, ప్రతిపక్ష పార్టీల తరఫున గెలిచిన శాసనసభ్యులు కూడా అధికారం కోసం పార్టీలు ఫిరాయించి అధికార పార్టీలో చేరడం వంటి లొసుగుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలంలో ఆశించిన ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరడం లేదు. తెలంగాణ వ్యతిరేకులే ప్రభుత్వంలో పార్టీలో కొనసాగుతుంటే వారందరికీ పదవులను పంపిణీ చేయడానికి ప్రభుత్వ సమయం గడిచిపోతుంటే ఇక ప్రజల గురించి పట్టించుకునే దెన్నడు..? పట్టించుకునేది ఎవరు..? అయితే ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం సెంటిమెంటును ముందట వేసుకొని రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో మొత్తానికి ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, అందరినీ తెరాసలో జాయిన్ చేసుకొని ప్రశ్నించే వారిని లేకుండా చేసింది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ మళ్ళీ పని చేస్తుందా లేదా అనేది కనబడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: