ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది కరోనా వైరస్. సౌత్ ఆఫ్రికా దేశం లో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వైరస్ పేరెత్తితే చాలు ప్రపంచ దేశాలు ఉలికిపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రెండవ దశ కరోనా వైరస్ లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది. మొదటి దశ కంటే ఎక్కువగా ప్రభావం చూపి  అందరిలో ప్రాణ భయం కలిగించింది. వేగంగా వ్యాప్తి చెందుతూ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు తీసుకువచ్చింది. ప్రపంచ దేశాలు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఈ వైరస్ కట్టడి సాధ్యం అయింది.



 అయితే రెండవ దశ కరోనా వైరస్ వ్యాప్తి తోనే భయపడిపోయిన జనాలు.. ఇక ఇప్పుడు ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్  వెలుగులోకి వచ్చింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో భయపడిపోతున్నారు. అయితే ఇక ఈ కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకారి అని అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక రోజు రోజుకి  కొన్ని దేశాలలో ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతు ఉండటం ఆందోళనకరంగా మారిపోయింది. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఎయిర్పోర్టులో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చాయి.


 అయితే ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ గురించి ఇటీవలే మరో నిజం బయట పెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండవ దశలో వ్యాప్తిచెందిన డెల్టా వేరియంట్   పోల్చి చూస్తే ఓమిక్రాన్ లో రీ ఇన్ఫెక్షన్ మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది అంటూ డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఓమిక్రాన్ సోకిన వారికి 90 రోజుల తర్వాత మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుందని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన డేటా తో వెల్లడైంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే దక్షిణాఫ్రికా దేశంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా చాలా మంది పిల్లలు ఆసుపత్రి పాలు అవుతున్నారు అన్న విషయం డేటా ప్రకారం వెల్లడయింది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: