ఈ వారం మరోమలుపు
తీసుకుంది
జగన్ రాజకీయం కూడా
అదే విధంగా మరో కొత్త వివాదం వైపు
మళ్లింది... జగన్ జీఓల పేరిట సినిమావోళ్లపై
యుద్ధం ప్రకటిస్తే.. చంద్రబాబు మాత్రం
తిరుపతి కేంద్రంగా భార్య భువనేశ్వరితో రాజకీయం
నడిపేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు
వీకెండ్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూడండి..ఈ వారం చంద్రబాబు భార్య మరియు ఎన్టీఆర్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఆమె త్వరలో రాజకీయంగా అరంగేట్రం చేస్తే చేయొచ్చు. అందుకు తిరుపతి కేంద్రంగా ఆమె తన అదృష్టంను పరీక్షించు కోనూవచ్చు. ఏమయినా చొరవ మాత్రం చంద్రబాబుదే! రేపటి వేళ తిరుపతి వరద బాధితులను పరామర్శించి చెక్కులు అందించే కార్యక్రమంకు ఆమె హాజరు కానున్నారు. తమ ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందించనున్నారు. అదేవిధంగా వారి యోగ క్షేమాలు తెలుసుకోనున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ కానుంది. పేరుకు పరామర్శల పర్వం అయినా ఇదే అవకాశంగా వచ్చే ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి