చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. రూపాంతరం చెందుతూ ఇక ప్రపంచ ప్రజానీకానికి పట్టిపీడిస్తోంది. ప్రతి ఒక్కరిలో ప్రాణ భయాన్ని కలిగించింది ఈ మహమ్మారి. ఈ క్రమంలోనే వైరస్ పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు. ఎన్నో దేశాలలో వ్యాక్సిన్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రతి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగిస్తున్నారు. భారత్లో కూడా రెండు రకాల వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలను ప్రజలకు ఉచితంగానే వేస్తుంది భారత ప్రభుత్వం. అయితే కోవిషీల్డ్ వాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంతో ఇక ఎంతో మంది ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపారు.



 అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పటికే వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయి అన్నదానిపై పరిశోధనలు కూడా మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే అన్ని దేశాలకు సంబంధించిన వ్యాక్సిన్ లపై కూడా అధ్యయనాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజనీకా  తయారు చేసిన కోవిషీల్డ్ పనితీరుపై కూడా ఏడియన్బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించగా సంచలన  విషయం బయటపడింది.  కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న తర్వాత దాదాపు మూడు నెలల తర్వాత టీకా ద్వారా వచ్చిన యాంటీబాడీలు క్షీణిస్తున్న ట్లు   ఈ అధ్యయనంలో గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.



 ఇక ఇలాంటి పరిస్థితుల్లో  ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ప్రమాదకర వేరియంట్లు నుంచి రక్షణ కష్టమేనని..  బూస్టర్ డోసు ద్వారా ప్రమాదకరమైన  వేరియంట్స్ నుంచి రక్షణ పొందవచ్చు అంటూ తెలిపారు. అయితే పరిశోధకులు కేవలం ఒక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేశారు.. స్కాట్లాండ్,  బ్రెజిల్కు చెందిన మొత్తం 4.4 కోట్ల మందిలో వ్యాక్సిన్ కారణంగా ఏర్పడిన యాంటీబాడీలను స్థాయికి సంబంధించి డేటాను సేకరించిన తర్వాత విశ్లేషణ జరిపినట్లు గ్లాస్గో వర్సిటీ ఆచార్యుడు కటికి రెడ్డి శ్రీనివాస విఠల్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: