టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇక రోడ్డు రవాణా సంస్థను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు కూడా వెనకాడటం లేదు సజ్జనార్. ఇప్పటివరకు సజ్జనార్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి.  ఇక ఇప్పుడు ప్రయాణికుల కోసం 3845  కొత్త బస్సులను ఏర్పాటు చేయడానికి సజ్జనార్ నిర్ణయించారు. ఇంతగా భారీ బస్సు సర్వీసులు దేనికోసం అని అనుకుంటున్నారా.. తెలంగాణలో ఎంతగానో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం.


 తెలంగాణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ప్రఖ్యాతిగాంచినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని భక్తులు మొక్కులు  చెల్లించుకుంటారు. ఇక మేడారం జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది అన్న విషయం తెలిసిందే.  మేడారం జాతర కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతుండగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జాతర నిర్మించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఇక జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే టీఎస్ ఆర్టీసీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరకు ప్రయాణమై భక్తుల కోసం 3845 బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు   అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా ఇక మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.. కరోనా వైరస్ శానిటేషన్ వంటి ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందట. అయితే దాదాపు 3845 బస్సులు నిలిపేందుకు గానూ అటు మేడారంలో 50 ఎకరాలలో భారీ  బస్టాండు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మేడారం యాత్ర  కోసం భారీగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండడంతో అటు ఎంతో మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: