తెలుగుదేశంపార్టీ ఏర్పాటైన దగ్గర నుండి మద్దతుగా నిలబడిన ఏకైక సామాజికవర్గం బీసీలే. పైగా బీసీ సామాజికవర్గమంటే సమాజంలోని జనాభాలో దాదాపు 50 శాతం ఉన్నారు. అలాంటి సామాజికవర్గం మద్దతును చంద్రబాబునాయుడు చాలా కష్టపడి పోగొట్టుకున్నారు. ఇపుడు టీడీపీకి మద్దతుగా నిలబడుతున్న సామాజికవర్గాలన్నీ అప్పట్లో ఎన్టీయార్ కారణంగా వచ్చినవే. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ పగ్గాలతో పాటు సీఎం కుర్చీని కూడా లాక్కున్న తర్వాత కొత్తగా పార్టీకి మద్దతిచ్చిన సామాజికవర్గం ఒక్కటి కూడా లేదు.




ఇలాంటి నేపధ్యంలోనే 2014-19 మధ్య తన వ్యవహారశైలి కారణంగా చంద్రబాబు బీసీలను దూరం చేసుకున్నారు. 30 ఏళ్ళు తానే అధికారంలో ఉంటానన్న గర్వమే లేకపోతే ఎటూపోరులే అన్న ఓవర్ కాన్ఫిడెన్సో తెలీదు కానీ  అనవసరంగా గోకి గోకి మరీ బీసీలతో గొడవపెట్టుకున్నారు. బీసీ సంఘాల నేతలు మాట్లాడటానికి వస్తే తోకలు కట్ చేస్తానన్నారు, అసలు వీళ్ళని సచివాలయంలోకి రానిచ్చెందవరంటు సెక్యురిటిని అరిచారు. అనంతపురంలో అయితే ఒక నేతపై చేయికూడా చేసుకున్నారు.




ఇలాంటి అనేక కారణాలతో బీసీల్లో చీలికవచ్చి కొందరు వైసీపీకి కూడా ఓట్లేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బీసీలను నెత్తిన పెట్టుకున్నారు. దాంతో చంద్రబాబు-జగన్ మధ్య తేడాను బీసీలు బాగానే గుర్తించారు. ఇపుడిదంతా ఎందుకంటే దూరమైపోయిన బీసీలను దగ్గర చేర్చుకునేందుకు చంద్రబాబు మళ్ళీ బీసీలతో సమావేశాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారట. బీసీలు దూరం అవటం వల్ల జరిగిన డ్యామేజీ ఏమిటో ఇప్పటికి అర్ధమైనట్లుంది. ఇపుడు కూడా పార్టీ పరంగా బీసీ సెల్ ఉండగా మల్లీ బీసీ ఫెడరేషన్ అని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు.




అందుకనే ఎన్నికలకు రెండున్నరేళ్ళుండగానే బీసీలను దగ్గరకు తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ పదవులను బీసీలకు ఎరగా వేయాలని డిసైడ్ అయ్యారట. విచిత్రమేమిటంటే అధికారంలో ఉన్నపుడు పార్టీ పదవులు ఇవ్వక, ప్రభుత్వంలో పదవులు ఇవ్వకుండా చాలామందిని చంద్రబాబు ఎండగట్టారు. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు అందరు గుర్తుకొస్తున్నారు.




తొందరలో మొదలవ్వబోయే జిల్లాల టూర్లలో చంద్రబాబు హామీలను బీసీలు నమ్మి మళ్ళీ దగ్గరవుతారా అనేదే కీలకం. ఎంపీలు, ఎంఎల్ఏలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మంత్రిపదవులు ఇలా ఎక్కడ చూసినా బీసీలకు జగన్ బాగానే ప్రాధాన్యతిస్తున్నారు. ఆల్రెడీ ప్రాధాన్యత ఇస్తున్న జగన్ను కాదని అధికారంలోకి వస్తే ఇస్తానని హామీలిచ్చే చంద్రబాబును నమ్ముతారా ?




మరింత సమాచారం తెలుసుకోండి: