ఈ ఫ్లైఓవర్ దాదాపు మూడు కిలో మీటర్ల పొడవు ఉంది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా చాలా సౌకర్యాలు రాబోతున్నాయి. ఇది ఏకంగా ఆరు లైన్ల ఫ్లైఓవర్ కావడం విశేషం. అంతే కాదు.. ఈ ఫ్లై ఓవర్ కింద ఓ అద్భుతమైన పార్కు కూడా ఏర్పాటు చేశారు. బయో డైవర్సిటీ అధికారులు ఫ్లై ఓవర్ కింద వివిధ మొక్కలతో అద్భుతమైన పార్కు రూపొందించారు. అంతే కాదు.. వాకింగ్ ట్రాక్, ఫౌంటెయిన్లు కూడా ఉన్నాయి. ఇలా ఓ ఫ్లైఓవర్ కింద పార్కు ఉండటం హైదరాబాద్ నగరంలో తొలిసారి.
ఇక ఈ ఫ్లై ఓవర్ విశేషాల్లోకి వెళ్తే.. దీన్ని వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి స్కీమ్‌లో నిర్మించారు. రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని 2.8 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. ఈ భారీ ఫ్లై ఓవర్‌తో నానల్‌నగర్ నుంచి ఖాజాగూడ వరకూ సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 11 కిలోమీటర్ల కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణమే.
ఈ ఫ్లైఓవర్‌తో నగరం నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇన్నర్ రింగు రోడ్డు నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు లక్డీకాపూల్, మెహిదీపట్నం, టౌలిచౌకీ, గచ్చిబౌలి రూట్లలో ప్రయాణించే దాదాపు 4 లక్షల మందికి ఈ ఫ్లైఓవర్‌తో ప్రయోజనం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి